పౌరాణిక పాత్రలో కళ్యాణ్ రామ్..న్యూ లుక్ సీక్రెట్ అదే..!

తెలుగు ఇండస్ట్రీలో పౌరాణిక పాత్రలు చేయాలంటే నందమూరి వంశం తర్వాతే ఎవరైనా. ఇది ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఎందుకంటే రాముడు, కృష్ణుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఆ దేవుళ్లను మన కళ్లముందు సాక్షాత్కరించింది నందమూరి తారక రామారావు. ఆయనను చూసి దేవుడు నిజంగా ఇలాగే ఉంటాడేమో అనుకునేవాళ్ళు అభిమానులు. ఆ తర్వాత తండ్రి పరంపరను కొనసాగిస్తూ బాలకృష్ణ కూడా పౌరాణిక పాత్రలు చేశాడు. రావణుడు, రాముడు, కృష్ణుడు ఇలా కొన్ని పాత్రల్లో కనిపించాడు బాలయ్య. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా యమదొంగలో యమధర్మరాజు పాత్ర చేశాడు.
ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ వంతు. దాదాపు 18 ఏళ్ల కెరీర్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పౌరాణిక పాత్ర చేయలేదు కళ్యాణ్ రామ్. అలాంటి కథలు ఆయన వైపు రాలేదు. వచ్చి ఉంటే కచ్చితంగా చేసేవాడిని అంటూ చాలా సార్లు చెప్పాడు ఈ హీరో. ఇప్పుడు ఈయన కోరిక నెరవేరబోతోంది. త్వరలోనే ఒక పౌరాణిక పాత్ర చేయబోతున్నాడు కళ్యాణ్ రామ్. ఇన్నేళ్ల కెరీర్లో అతనొక్కడే, పటాస్ తప్ప బ్లాక్ బస్టర్స్ లేని కళ్యాణ్ రామ్ తాజాగా ఒక సంచలన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొత్త దర్శకుడు మల్లిడి వేణు చెప్పిన కథ నచ్చి రావణ పాత్రలో నటించబోతున్నారు కళ్యాణ్. అందుకే తన లుక్ కూడా పూర్తిగా మార్చేశాడు.
కోరమీసాలు, గుబురు గడ్డంతో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ మధ్య విడుదలైన ఈయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. ఇదిలా ఉంటే మల్లిడి వేణు సినిమాలో రావణుడి పాత్రలో రాబోతున్నాడు కళ్యాణ్. ఈ పాత్రను ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు. నందమూరి వంశం అంటే పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు కాబట్టి ఆ పేరు నిలబెట్టాలని చూస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నాడు. సొంత సినిమా కావడంతో దీనికి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దీన్ని నిర్మించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు కళ్యాణ్ రామ్. మరి ఈ నందమూరి హీరో రావణుడి పాత్రలో ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి
కళ్యాణ్ రామ్ కొత్త లుక్ వైరల్
జూనియర్ ఎన్టీఆర్ తొలి పారితోషికం ఎంతంటే..?
2021-టాలీవుడ్ ఫ్యూచర్ డిసైడ్ చేసేది ఈ సినిమాలే..!
హాట్ టాపిక్‌గా మారిన ప్రభాకర్ పారితోషికం
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- తాజ్ మహల్ సాక్షిగా వివాహ వార్షికోత్సవం..
- భయపెడుతున్న భానుడి భగభగలు
- అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి
- కబడ్డీ కోర్టులో కొండెంగ.. నేను ఆడుతా!
- మరోసారి బుల్లితెరపై సందడికి సిద్ధమైన రానా..!
- ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
- పొట్టేళ్ల పందెం పోటీలు.. మూడు రాష్ర్టాల నుంచి 22 జీవాలు రాక
- శివుడి సాక్షిగా అభిమానులకు షాక్ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్
- చదివింది 'పది'.. వ్యాపారం 'కోటి'..
- ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య