జగపతిబాబు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!

టాలీవుడ్ హీరో జగపతిబాబు సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ లీడ్ రోల్లో చేస్తున్న చిత్రం FCUK ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్. డెబ్యూట్ డైరెక్టర్ విద్యాసాగర్ రాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ సినిమాలోని నాలుగు పాత్రలను పరిచయం చేస్తూ ఒక్కో పోస్టర్ ను విడుదల చేయగా..మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.
ఫిబ్రవరి 12న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. జగపతిబాబు మీడియాతో మాట్లాడుతూ..ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్టవుతుందన్న నమ్మకముందని చెప్పారు. ప్రేక్షకులను మంచి వినోదాన్ని అందించే సినిమాను అందిస్తున్న నిర్మాత దామోదర ప్రసాద్, డైరెక్టర్ విద్యాసాగర్ రాజు, లీడ్ రోల్స్ చేస్తున్న రామ్ కార్తీక్, అమ్ము, అభిరామి, బేబి సహశ్రితతోపాటు చిత్రం కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరిని ప్రశంసించాడు.
శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై కేఎల్ దామోదర ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బీమ్స్ సెసిరొలియా మ్యూజిక్ డైరెక్టర్. కార్తీక్, అమ్ము అభిరామి, బేబి సహస్రిత కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కమెడీయన్స్ గ్రూప్ ఫొటో.. వైరల్గా మారిన పిక్
తెరపైకి నాగార్జున-పూరీ కాంబినేషన్..?
‘క్రాక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.