మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 11, 2020 , 14:42:27

మంచు మ‌నోజ్ హై కిక్ స్టిల్ చూశారా..?

మంచు మ‌నోజ్ హై కిక్ స్టిల్ చూశారా..?

క‌రోనా మ‌హ‌మ్మారితో చాలా రంగాల‌తో సినీప‌రిశ్ర‌మ‌లో కూడా ప‌నులు నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ త‌ర్వాత మెల్ల‌మెల్ల‌గా సినీ ఇండ‌స్ట్రీలో షూటింగ్స్ మొద‌ల‌వుతున్నాయి. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్స్ లో పాల్గొనేందుకు సిద్ద‌మ‌వుతున్నారు తార‌లు. టాలీవుడ్ యాక్ట‌ర్ మంచు మ‌నోజు సుదీర్ఘ విరామం త‌ర్వాత అహం బ్రహ్మాస్మి చిత్రాన్ని చేస్తున్నాడు. లాక్ డౌన్ కు ముందే ఈ మూవీ టైటిల్ ను విడుద‌ల చేశాడు.

యాక్ష‌న్ ఓరియెంటెడ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా కోసం మ‌నోజ్ సీరియ‌స్ వ‌ర్క‌వుట్స్ ప్రారంభించాడు. త‌న ట్రైన‌ర్ సార‌థ్యంలో హై కిక్ ను ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్రియ‌మైన ప్ర‌జ‌ల‌కు గుడ్ మార్నింగ్..రైజ్ అండ్ షైన్..బ్యూటీఫుల్ డే అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్ర‌యోగాలు చేయ‌డంలో ఎప్పుడూ ముందుండే మంచు మ‌నోజ్..అహం బ్ర‌హ్మాస్మి కోసం అద్బుత‌మైన పోరాట స‌న్నివేశాల్లో పాల్గొన‌నున్నాడ‌ట‌. పాన్ ఇండియా క‌థాంశంతో శ్రీకాంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును తెర‌కెక్కిస్తున్నాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo