బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 23, 2020 , 17:52:35

'సీటీమార్' షూటింగ్ షురూ అయింది..వీడియో

'సీటీమార్'  షూటింగ్ షురూ అయింది..వీడియో

సంపత్ నంది ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న కొత్త చిత్రం సీటీమార్‌. గోపీచంద్‌, త‌మన్నా హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఎట్ట‌కేల‌కు షురూ అయింది. ప్రొడ‌క్ష‌న్ టీం స్పెష‌ల్ గా వేసిన సెట్ లో చేస్తున్న‌ ఏర్పాట్ల‌కు సంబంధించిన వీడియోను బీఏ రాజు ట్విట‌ర్ లో షేర్ చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వ‌స్తున్న ఈ మూవీని శ్రీనివాస చిట్టూరినిర్మిస్తున్నారు. సీటీమార్ లో గోపిచంద్ ఫీమేల్ క‌బ‌డ్డీ టీం కోచ్ గా క‌నిపించ‌నుండ‌గా..త‌మ‌న్నా తెలంగాణ క‌బ‌డ్డీ టీం కోచ్ రోల్ లో మెరువ‌నుంది. ఇప్ప‌టికే త‌మ‌న్నా జ్వాలా రెడ్డి లుక్ పోస్ట‌ర్ ను చిత్ర‌యూనిట్ షేర్ చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది.

భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ ఎలిమెంట్స్ తో తీస్తున్న ఈ ప్రాజెక్టులో దిగంగ‌న సూర్య‌వంశీ మ‌రో హీరోయిన్ గా న‌టిస్తోంది. భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ డైరెక్ట‌ర్. సీటీమార్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది కుమారుడు కీ రోల్ పోషిస్తుండ‌టం విశేషం. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo