బుధవారం 23 సెప్టెంబర్ 2020
Cinema - Aug 03, 2020 , 20:29:43

ప్ర‌భాస్ బ్యాన‌ర్ లో గోపీచంద్ సినిమా..!

ప్ర‌భాస్ బ్యాన‌ర్ లో గోపీచంద్ సినిమా..!

సంప‌త్ నంది డైరెక్ష‌న్ లో టాలీవుడ్ యాక్ట‌ర్ గోపీచంద్ సీటీమార్ చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది చివ‌ర్లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశాలున్నాయి. ఇదిలా ఉంటే మ‌రోవైపు  డైరెక్ట‌ర్ తేజ‌తో గోపీచంద్ ఓ సినిమా చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానున్న‌ట్టు తెలుస్తోంది. 

ఈ రెండు ప్రాజెక్టుల విష‌యం ప‌క్క‌నే పెడితే..ఇపుడు గోపీచంద్ మ‌రో సినిమా న్యూస్ ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. సాహో చిత్ర ద‌ర్శ‌కుడు సుజిత్ తో గోపీచంద్ యాక్ష‌న్ మూవీని ప్లాన్ చేస్తున్న‌ట్టు చ‌ర్చ న‌డుస్తోంది. అంతేకాదు ప్ర‌భాస్ సొంత బ్యాన‌ర్ యూవీ క్రియేష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తుంద‌ట‌. ప్ర‌భాస్-గోపీచంద్ మంచి స్నేహితుల‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో గోపీచంద్ ఇప్ప‌టికే జిల్ సినిమా చేశాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo