శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 25, 2020 , 19:03:04

చిరంజీవి కెరీర్ లో తొలిసారి రిస్క్ చేయ‌బోతున్నాడా..?

చిరంజీవి కెరీర్ లో తొలిసారి రిస్క్ చేయ‌బోతున్నాడా..?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మొదలు పెట్టి 42ఏళ్లు దాటిపోయింది. అప్పుడెప్పుడో 1978లో ఇండస్ట్రీకి వచ్చాడు ఈయన. ఆ తర్వాత 150 సినిమాలకు పైగా నటించాడు. ఇప్పటికీ మెగాస్టార్‌కు ఉన్న ఇమేజ్ చూస్తుంటే మిగిలిన హీరోలకు కుళ్లు వచ్చేస్తుంది. 65 ఏళ్ల వయసులో కూడా చిరు మేనియా నడుస్తుంది. ఇప్పటికీ ఈయన జోరుకు అంతా ఫిదా అయిపోతున్నారు. వరసగా సినిమాలు చేస్తూ రప్ఫాడిస్తున్నాడు అన్నయ్య. అయితే ఇప్పుడు ఈయన ఓ రిస్క్ తీసుకోడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదేంటంటే హీరోయిన్ లేకుండా సినిమా చేయడం. ఇప్పటి వరకు చిరంజీవి కెరీర్ లో అలా జరిగింది లేదు.

కెరీర్ కొత్తలో విలన్ గా నటించిన కొన్ని సినిమాలు తప్పిస్తే హీరోగా మారిన తర్వాత మాత్రం హీరోయిన్ లేకుండా సినిమాలు చేయడం లేదు చిరు. అసలు కమర్షియల్ హీరోకు అలాంటి సాహసం కూడా ఎవరూ చేయరు. కానీ మెగాస్టార్ ఇప్పుడు అలాంటి నిర్ణయమే తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన హీరోయిన్ లేకుండా సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్న ఈ హీరో.. ఆ తర్వాత వేదాళం రీమేక్ లో నటించబోతున్నాడు. ఆ తర్వాత మరో రీమేక్ కూడా చేస్తున్నాడు. 

అదే లూసీఫర్ రీమేక్..మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం త్వరలోనే తెలుగులో రీమేక్ కానుంది. జయం రాజాకు ఈ దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు మెగాస్టార్. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదని ప్రచారం జరుగుతుంది. ఒరిజినల్ లో హీరోయిన్ లేదు.. అలాగే తెలుగులో కూడా హీరోయిన్ లేకుండానే చేస్తున్నాడు మెగాస్టార్. కథలో మార్పులు కూడా పెద్దగా చేయడం లేదని తెలుస్తుంది. మరి చిరు చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.