ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 17:30:32

షాట్‌ ఒకే అన్నా..చిరంజీవి వన్‌ మోర్‌ టేక్‌ అన్నారు

షాట్‌ ఒకే అన్నా..చిరంజీవి వన్‌ మోర్‌ టేక్‌ అన్నారు

డాన్‌ శీను, బాడీగార్డ్‌, బలుపు, పండగ చేస్కో, విన్నర్‌ చిత్రాలతో టాలీవుడ్‌ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని. అసిస్టెంట్‌ డైరెక్టర్‌, అసోసియేట్‌ డైరెక్టర్‌, చీఫ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌గా వివిధ స్థాయిలో పనిచేసి..డైరెక్టర్‌గా గోపీచంద్‌ తనదైన మార్కును చూపించాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు రవితేజతో కలిసి క్రాక్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో కొన్ని విషయాలు పంచుకున్నాడు. చిరంజీవి నటిస్తోన్న అందరివాడు చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ సన్నివేశాన్ని షేర్‌ చేసుకున్నాడు.

అందరివాడు సినిమాకు చీఫ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నా. ఓ రోజు ఒక సీన్‌ ను షూట్‌ చేశారు. శ్రీనువైట్ల సీన్‌ను ఒకే చేసేశారు. కానీ చిరంజీవి మాత్రం వన్‌ మోర్‌ టేక్‌..వన్‌ మోర్‌ టేక్‌..అని డైరెక్టర్‌తో అన్నారు. సెట్స్‌లో ఉన్నవారికి చిరంజీవి అలా ఎందుకు అంటున్నారో అర్థం కాలేదు. చిరంజీవి అలా ఎందుకన్నారంటే..తాను (చిరంజీవి) నటించిన షాట్‌తో గోపిచంద్‌ మలినేని సంతృప్తి చెందినట్టు కనిపించలేదని, అందుకే వన్‌ మోర్‌ టేక్‌ చెప్పారని చిరంజీవి చెప్పారు.  ఆ సందర్భం తన జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకమని గోపీచంద్‌ మలినేని  అన్నాడు. డాన్‌, బలుపు తర్వాత క్రాక్‌ వంటి హ్యాట్రిక్‌ సినిమా మీ ముందుకొస్తుంది. ఈ మూవీ అందరినీ అలరించడం ఖాయమని గోపీచంద్‌ మలినేని చెప్పుకొచ్చారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo