గురువారం 21 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 17:08:48

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ల‌కు నో చెప్తున్న చిరంజీవి..కార‌ణమిదే..!

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ల‌కు నో చెప్తున్న చిరంజీవి..కార‌ణమిదే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అన్ని ర‌కాల హంగులు ఉంటాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఏదో ఆషామాషీగా సినిమా చేశామా..? అన్న‌ట్టుగా కాకుండా ఓ వైపు త‌న వ‌య‌స్సు, ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, మ‌రోవైపు ఏదో ఒక సామాజిక క‌థాంశాన్ని తీసుకుని సినిమా చేస్తుంటాడు. ఇక రీఎంట్రీ త‌ర్వాత చేయ‌నున్న సినిమాల విష‌యంలో కూడా చాలా కేర్ తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ప్ర‌స్తుతం రీమేక్స్ పై ఫోక‌స్ పెట్టిన చిరు కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశమివ్వాల‌నుకుంటున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ క్ర‌మంలో చిరు కొంత‌మంది ద‌ర్శ‌కుల‌కు నో చెప్ప‌డం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

సుజీత్‌, వినాయ‌క్‌, బాబీ..ఈ ముగ్గురు డైరెక్ట‌ర్ల‌తో సినిమా చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చినా..స్క్రిప్ట్ పై సంతృప్తి చెంద‌క‌పోవ‌డంతో నో చెప్పాడ‌ట‌.  మ‌రోవైపు త‌మిళ డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజాకు లూసిఫ‌ర్ రీమేక్ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నా..చిరు క‌థ‌ను ఫైన‌ల్ చేయాల్సి ఉంది. త‌న స్టోరీని చిరు ఓకే చేస్తాడా..?  లేదా అని మోహ‌న్ రాజా డైలామాలో ఉన్న‌ట్టు చ‌ర్చ న‌డుస్తోంది.  150 చిత్రాల్లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన చిరంజీవి ఏ క‌థను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నేది దానిపై స్ప‌ష్ట‌త ఉంది. 

అస‌లు చిరంజీవి డైరెక్ట‌ర్ల‌ను రిజెక్ట్ చేస్తుండ‌టానికి కార‌ణం.. క‌థ ప‌ర్‌ఫెక్ట్ గా ఉంటే సినిమాను ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌న్న‌ది చిరు న‌మ్మకం. అంతేకాదు స్క్రిప్ట్ వ‌ర్క్ స‌రిగ్గా ఉంటే సినిమాకు ఎలాంటి స‌మ‌స్య‌లు కూడా రావ‌ని న‌మ్ముతార‌ని చిరు స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. అందుకే స్క్రిప్ట్ వ‌ర్క్ ద‌శ‌లోనే ఏమైనా మార్పులు చేర్పులుంటే డైరెక్ట‌ర్లకు సూచిస్తూ స‌రైన క‌థ‌ను అభిమానుల‌కు అందించాల‌నేది చిరు ఆలోచ‌న‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo