గుండు లుక్ సీక్రెట్ చెప్పిన చిరంజీవి

Sep 24, 2020 , 21:03:45

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌లే సరికొత్త గెట‌ప్ లో క‌నిపించి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తిన విష‌యం తెలిసిందే. చిరు నున్న‌టి గుండుతో అర్బ‌న్ మాంక్ లో క‌నిపించిన ఫొటో నెట్టింట్లో వైర‌ల్ అయింది. అయితే ఎప్పుడూ క‌నిపించ‌ని విధంగా డిఫ‌రెంట్ గా క‌నిపించ‌డంతో చిరు..త‌న కొత్త చిత్రం ఆచార్య కోసం ఈ గెట‌ప్ వేసుకున్నాడా..అని అభిమానులు చ‌ర్చించుకోవ‌డం మొద‌లుపెట్టారు. అయితే గుండు బాస్ గెట‌ప్ వెనుకున్న సీక్రెట్ ఏంటో చెప్పాడు చిరు. ఓ ఆంగ్ల దిన‌ప‌త్రికకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌య‌మై చిరు మాట్లాడుతూ..ఈ గెట‌ప్ ఆచార్య సినిమా కోసం కాద‌ని, వేదాళ‌మ్ రీమేక్ కోసం చేసిన ట్ర‌య‌ల్ లుక్ షూట్ అని చెప్పాడు.

వేదాళమ్‌ సెకండ్ ఆఫ్ కోసం ఈ లుక్ ను ప్ర‌య‌త్నించి చూశార‌ట‌. వేదాళమ్ రీమేక్ ను మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ని స్ప‌ష్టం చేశాడు చిరు. కొరటాల శివ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఆచార్య షూటింగ్ లాక్ డైన్ ఎఫెక్ట్ తో నిలిచిపోగా..న‌వంబ‌ర్ లో రీస్టార్ట్ అయ్యే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD