బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 09, 2020 , 21:05:29

చడీ చప్పుడు లేని చిరంజీవి ట్విటర్ అకౌంట్..!

చడీ చప్పుడు లేని చిరంజీవి ట్విటర్ అకౌంట్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 2020లో సోషల్ మీడియాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. మార్చి 25న ట్విటర్ ఖాతాను షురూ చేశాడు చిరు. ఆ తర్వాత ప్రతీ రోజు చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికపుడు అప్ డేట్స్ ఇస్తుండేవాడు. ఇతర సెలబ్రిటీల ట్వీట్లపై కూడా వెంటనే స్పందించేవాడు. అయితే కొంతకాలంగా చిరు ట్విటర్ కు దూరంగా ఉంటున్నాడు. జూన్ 21న చిరంజీవి ఫాదర్స్ డే విషెస్ చెప్తూ చివరి ట్వీట్ పెట్టాడు. ఆ తర్వాత చిరంజీవి కొణిదెల ట్విటర్ హ్యాండిల్ లో ఎలాంటి పోస్టులు కనిపించలేదు.

చిరు ట్వీట్ పెట్టక ఇప్పటికి 18 రోజులు అవుతుంది. ప్రతీ సారి ఏదో ఒక ట్వీట్ తో అభిమానులను పలుకరించే చిరు..ఇలా సడెన్ గా సోషల్ మీడియాలో కనిపించకుండా పోవడానికి కారణమేమై ఉంటుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. చిరు ట్విటర్ ఖాతాను రాంచరణ్  మెయింటైన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోండగా..ప్రస్తుతం ఆసక్తి తగ్గడంతో ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదని వార్త చక్కర్లు కొడుతోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo