మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 19, 2020 , 17:55:12

వ‌ర‌ద నీటిలో న‌టుడు బ్ర‌హ్మాజీ ఇల్లు..ఫొటోలు

వ‌ర‌ద నీటిలో న‌టుడు బ్ర‌హ్మాజీ ఇల్లు..ఫొటోలు

గ‌త కొన్ని రోజులుగా హైద‌రాబాద్ వాసుల‌ను కుండ‌పోత వ‌ర్షాలు కంటి మీదు కునుకు లేకుండా చేస్తున్న దృశ్యాలు చూస్తునూ ఉన్నాం. ఇప్ప‌టికే జీహెచ్ఎంసీ, విప‌త్తు నిర్వ‌హ‌ణా బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నాయి. టాలీవుడ్ న‌టుడు బ్ర‌హ్మాజీ ఇల్లు కూడా వ‌ర‌ద ముంపున‌కు గురైంది. ఫిలింన‌గ‌ర్ లోని బ్ర‌హ్మాజీ నివాసం వ‌ర‌ద‌నీటిలో కూరుకుపోయింది.

బ్ర‌హ్మాజీ ఇంటి మెయిన్ గేట్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్ లోకి భారీగా వ‌ర‌ద నీరు చేరింది. అయితే బ్ర‌హ్మాజీ పైఫ్లోర్ లో ఉండ‌టంతో ప్ర‌స్తుతానికి సుర‌క్షితంగా ఉన్నారు. ఇది నా ఇల్లు అంటూ వ‌ర‌ద నీటితో నిండిన నివాసానికి సంబంధించిన ఫొటోల‌ను ట్విట‌ర్ లో పోస్ట్ చేశాడు. బ్ర‌హ్మాజీ. మరోవైపు ప‌లువురు సినీ స్టార్లు ఉండే మ‌ణికొండ ఏరియాలోని ప‌లు ఇండ్ల‌ను వ‌ర‌ద నీరు ముంచెత్తింది.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.