మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 20, 2020 , 17:05:13

ట్విట‌ర్ అకౌంట్ డిలీట్ చేసిన బ్ర‌హ్మాజీ..!

ట్విట‌ర్ అకౌంట్ డిలీట్ చేసిన బ్ర‌హ్మాజీ..!

టాలీవుడ్ న‌టుడు బ్ర‌హ్మాజీ వ‌ర‌ద నీటిలో త‌న ఇల్లు ఉన్న ఫొటోల‌ను సోమ‌వారం ట్విట‌ర్ లో పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే బ్ర‌హ్మాజీ తాను బోటు కొనాల‌నుకుంటున్నాన‌ని స‌ర‌దాగా కామెంట్ పెట్ట‌డంతో..బ్ర‌హ్మాజీ వ్యాఖ్య‌ల‌పై కొంత‌మంది నెటిజ‌న్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీంతో బ్ర‌హ్మాజీ త‌న ట్విట‌ర్ అకౌంట్ ను డిలీట్ చేశాడు. ట్విట‌ర్ ఖాతాను తొల‌గించడానికి గ‌ల కార‌ణాన్ని వివ‌రించాడు. 

నేను, నా కుమారుడు ఆ స‌మ‌యంలో బ‌య‌టి నుంచి ఇంటికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చాం. చాలా వ‌ర‌ద నీరు ఇంటిని చుట్టుముట్టింది. వ‌ర‌ద ఉధృతి కూడా ఎక్కువే ఉంది. నా ఇంటి ద‌గ్గ‌ర‌కు కారు  వెళ్లే ప‌రిస్థితి లేదు. దీంతో స‌మీపంలోని కాల‌నీ వాసుల‌ను అడిగి కారు అక్క‌డే పార్కు చేశాను. నేను నా భార్య ఇంటికి న‌డుచుకుంటూ వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాం. అయితే వ‌ర‌ద ఎక్కువ‌గా ఉండ‌టంతో..కొంత‌మంది స్థానికులు వ‌చ్చి మేం ఇంటికి సుర‌క్షితంగా వెళ్లేలా సాయం చేశారు. బేస్ మెంట్ లో కూడా వ‌ర‌ద ప్ర‌వాహం ఎక్కువ‌గా ఉంది. అప్పు‌డే నేను బోటును కొనాల‌నుకుంటున్నాన‌ని ట్విట‌ర్ లో చిన్న జోకు వేశాన‌ని బ్ర‌హ్మాజీ చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడైనా హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరు, ఢిల్లీలో ఉన్న‌పుడు ఇలాంటి త‌న‌పై జోకులు వేసుకుంటాన‌ని చెప్పాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.