బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 18:27:55

మేకప్‌ వేసుకునేందుకు రెడీ అవుతున్న బాల‌కృష్ణ

మేకప్‌ వేసుకునేందుకు రెడీ అవుతున్న బాల‌కృష్ణ

టాలీవుడ్ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. 6 నెల‌ల లాక్ డౌన్ ఎఫెక్ట్ నుంచి మెల్ల‌మెల్ల‌గా కోలుకుంటోంది సినీ ప‌రిశ్ర‌మ‌. ఈ నేప‌థ్యంలో బాల‌య్య మ‌ళ్లీ మేక‌ప్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం బాల‌య్య సెప్టెంబ‌ర్ 14న షూటింగ్ లో పాల్గొన‌నున్నాడు. బీబీ3 సినిమా కోసం నిర్మాత‌లు రామోజీఫిలిం సిటీలో ఓ విలేజ్ సెట్ ను వేశారు. గ్రామీణ నేప‌థ్యంలో వ‌చ్చే కీల‌క స‌న్నివేశాల‌ను ఈ లొకేష‌న్ లో బోయ‌పాటి టీం షూట్ చేయ‌నుంది. 

బాల‌కృష్ణ‌తోపాటు కీల‌క న‌టీన‌టుల‌పై సీన్ల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. బీబీ3 (వ‌ర్కింగ్ టైటిల్‌)మూవీలో బాల‌కృష్ణ‌కు జోడీగా కొత్త హీరోయిన్ న‌టిస్తోంది. బాల‌కృష్ణ‌-బోయ‌పాటి కాంబోలో భారీ బడ్జెట్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తున్న ఈ చిత్రంపై భారీగానే అంచ‌నాలు ఉన్నాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo