మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 14:34:18

ఇత‌రుల‌ను ఫాలో కాని బాలకృష్ణ‌..?

ఇత‌రుల‌ను ఫాలో కాని బాలకృష్ణ‌..?

అన్ లాక్ 5.0 మార్గ‌ద‌ర్శ‌కాలు వెలువ‌డ‌టంతో హీరోలంతా ఇప్పుడు ఒక్కొక్క‌రుగా త‌మ సినిమా షూటింగ్స్ ను షురూ చేస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు నిలిచిపోయిన షూటింగ్స్ ను మ‌ళ్లీ రీస్టార్ట్ చేసుకుంటున్నారు.  బాల‌కృష్ణ‌-బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో బీబీ3 చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే టాలీవుడ్ యాక్ట‌ర్ నందమూరి బాల‌కృష్ణ మాత్రం ఇప్ప‌టికీ త‌న సినిమా చిత్రీక‌ర‌ణ  మ‌ళ్లీ మొద‌లుపెట్ట‌లేదు. 

లాక్ డౌన్ తో వీలైంత స‌మ‌యం దొరుకుతుండ‌టంతో బస‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రికి సంబంధించిన చాలా ప‌నుల ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. త‌మ సినిమాను రీస్టార్ట్ చేసేందుకు బోయ‌పాటి రెడీగా ఉన్నా..బాల‌కృష్ణ ఉంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పంద‌న రాలేద‌ట‌. అంద‌రిలా తాను కూడా ఇప్పుడే షూటింగ్ మొద‌లు పెట్ట‌కుండా కేసులు పూర్తిగా అదుపులోకి వ‌చ్చిన త‌ర్వాత షూటింగ్ కు వెళ్తే బాగుంటుంద‌ని బాల‌కృష్ణ భావిస్తున్నాడ‌ట‌. మ‌రి బాల‌య్య సినిమా షూట్‌కు ఎప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడో చూడాలి.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo