శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 26, 2020 , 17:17:33

ఆనంద్ దేవ‌ర‌కొండ కేఫ్ కు వెళ్తే సగం బిల్లు మాత్ర‌మే ..!

ఆనంద్ దేవ‌ర‌కొండ కేఫ్ కు వెళ్తే సగం బిల్లు మాత్ర‌మే ..!

టాలీవుడ్ యాక్ట‌ర్ విజ‌య్‌దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ న‌టించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంటున్న విష‌యం తెలిసిందే. వ‌ర్ష‌బొల్ల‌మ్మ‌, ఆనంద్ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఈ సినిమా విజ‌యంతో ఫుల్ జోష్ మీదున్న ఆనంద్ త‌న స్నేహితుల‌తో క‌లిసి గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్ పెట్టాడు. ఈ విష‌యాన్ని బీఏ రాజు ట్విట‌ర్ లో షేర్ చేశారు. గుడ్ వైబ్స్ కేఫ్ లో ‌మొద‌టి విలువైన చెల్లింపును చేయండి అని ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ వారాంతంలో కేఫ్ వ‌చ్చే ప్ర‌తీ విజిట‌ర్ కు స‌గం బిల్లు మాత్ర‌మే చెల్లించే ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంద‌ని చెప్పారు. 

మిడిల్ క్లాస్ మెలోడీస్‌-రాఘ‌వ నాకు తొలిసారి పెద్ద విజ‌యాన్ని అందించారు. మీ అంద‌రి ప్రేమ‌ మా క‌ల‌ల‌కు బ‌లం చేకూర్చింది. మా స్నేహితుల ఫుడ్ డ్రీమ్స్ ను క‌ల‌ను నెర‌వేర్చ‌డానికి మొద‌టి చెక్కుతో పెట్టుబ‌డి పెట్టాను..అని ట్విట‌ర్ లో పోస్ట్ పెట్టాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. హైద‌రాబాద్‌లోని ఖాజాగూడ‌లో ఈ కేఫ్ పెట్టారు. ఇంకేముంది ఆనంద్ దేవ‌ర‌కొండ గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్ కు మీరు కూడా ఓ సారి వెళ్లొచ్చేందుకు ప్లాన్ చేసుకోండి మ‌రీ. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.