ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 13, 2020 , 14:07:24

బ‌న్నీ స్పెష‌ల్ ఫేస్ మాస్క్...ఫొటో వైర‌ల్

బ‌న్నీ స్పెష‌ల్ ఫేస్ మాస్క్...ఫొటో వైర‌ల్

అల్లు అర్జున్‌..టాలీవుడ్ ప్రేక్ష‌కులు స్టైలిష్ స్టార్ అని పిలుచుకుంటార‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌నవ‌స‌రం లేదు. ట్రెండీ డ్రెస్సుల‌తో యూత్ కు బాగా క‌నెక్ట్ అవుతుండాడు బ‌న్నీ. ఈ యాక్ట‌ర్ తాజాగా ఓ మాస్క్ తో క‌నిపించి సంద‌డి చేశాడు. క‌రోనాతో ఇపుడు మార్కెట్ లోకి ర‌క‌ర‌కాల మాస్కులు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే బ‌న్నీ ప్ర‌త్యేకంగా మాస్కుల‌ను డిజైన్ చేయించుకున్నాడు. మాస్క్ పై ‘AA’ లెట‌ర్స్ ను వేయించుకున్నాడు.
 
డ్రెస్ కు మ్యాచింగ్ అయ్యే మాస్క్ తో క‌నిపించిన అల్లు అర్జున్ ను ఫొటో తీసేందుకు అభిమానులు ఎగ‌బ‌డ్డారు. కారులో స్పెష‌ల్ మాస్క్ లో ఉన్న బ‌న్నీని త‌మ కెమెరాల్లో బంధించేందుకు తెగ క‌ష్ట‌ప‌డ్డారు ఫ్యాన్స్. బ‌న్నీ స్పెష‌ల్ మాస్క్  పెట్టుకున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ తో క‌లిసి పుష్ప సినిమా చేస్తున్నాడు. డిసెంబ‌ర్ లో మిగిలిన షూటింగ్ షురూ కానుంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo