గురువారం 04 మార్చి 2021
Cinema - Jan 07, 2021 , 21:08:23

మీ ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు..బన్నీస్పెష‌ల్ వీడియో

మీ ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు..బన్నీస్పెష‌ల్ వీడియో

టాలీవుడ్ యాక్ట‌ర్ అల్లు అర్జున్ ను అభిమానులు స్టైలిష్ స్టార్ అని పిలుచుకుంటార‌ని తెలిసిందే. సోష‌ల్ మీడియాలో అత్య‌ ‌ధిక ఫాలోవ‌ర్లున్న సౌతిండియా యాక్ట‌ర్ల‌లో అల్లు అర్జున్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. తాజాగా ఈ న‌టుడు మ‌రో ఫీట్ ను చేరుకున్నాడు. అల్లు అర్జున్ ఇన్ స్ట్రాగ్రామ్ ఫాలోవ‌ర్ల సంఖ్య 10 మిలియ‌న్ల మార్క్ ను దాటింది. ఈ సంద‌ర్భంగా బ‌న్నీ ఇన్ స్టాలో ఓ సందేశం పోస్ట్ చేశాడు. నాపై అమిత‌మైన ప్రేమ‌ను చూపిస్తున్న అందరికీ ధ‌న్య‌వాదాలు. మీరంతా నా శ‌క్తిగా ఉన్నందుకు కృత‌జ్ఞ‌త‌లు. మీ ఆశీర్వాదాలకు వినయ‌పూర్వ‌క న‌మ‌స్కారాలు అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు.

బుట్ట‌బొమ్మా సాంగ్ మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే త‌న జ‌ర్నీ ఫొటోల‌తో రూపొందించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పో్ట్ చేశాడు బ‌న్నీ. సుకుమార్ కాంబినేష‌న్ లో ముచ్చ‌ట‌గా మూడోసారి పుష్ప సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్.

ఇవి కూడా చ‌ద‌వండి

స్నాక్స్ ఎత్తుకెళ్లిన‌ సోనాక్షిసిన్హా..వీడియో వైర‌ల్

సోషల్ మీడియాలో వ‌కీల్ సాబ్ ఫొటోలు హ‌ల్‌చ‌ల్‌

లాక్‌డౌన్ త‌ర్వాత తొలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌..!

నీకు టాలెంట్ లేదు..మాకొద్ద‌న్నారు: నోరా ఫ‌తేహి

చిరు 'ఆచార్య' టెంపుల్ టౌన్ చూశారా..?

కిమ్‌-వెస్ట్ వైవాహిక బంధానికి తెర‌ప‌డ్డ‌ట్టేనా..?

'ఆచార్య' సిబ్బందికి సోనూసూద్‌ స్మార్ట్ ఫోన్లు గిఫ్ట్

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo