కష్టమైన పనేంటో చెప్పిన అల్లరి నరేశ్..!

కామెడీ రోల్స్ చేస్తూనే, హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటుడెవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నటకిరిటీ రాజేంద్రప్రసాద్. ఆయన బాటలో పయనిస్తూ ఇప్పటి జనరేషన్ ను ఎంటర్టైన్ చేస్తున్న యాక్టర్ అల్లరి నరేశ్. తనదైన కామెడీ టచ్‌తో సినిమాలు చేయడం అల్లరి నరేశ్‌కు వెన్నతో పెట్టిన విద్య. మరోవైపు సీరియస్ పాత్రల్లో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. మహర్షి సినిమాలో మహేశ్‌బాబు స్నేహితుడి పాత్రలో అద్బుతంగా నటించి అందరినీ మెప్పించాడు.
సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బంగారుబుల్లోడు సినిమాతో వినోదాన్ని అందించేందుకు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు నరేశ్. మరోవైపు ప్రయోగాత్మక చిత్రం నాందిలో కూడా నటిస్తున్నాడు. శనివారం బంగారుబుల్లోడు చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు అల్లరి నరేశ్. అల్లరి నరేశ్ నటనకు ఆస్కారమున్న పాత్రలు చేయమంటే ఇష్టమని చెప్పాడు నరేశ్.
అల్లరి నరేశ్ తనకు కామెడీ హీరో అని బ్రాండ్ ఇమేజ్ రావడం ఆనందంగా ఉందన్నాడు. కామెడీ చేస్తూ ప్రేక్షకులను నవ్వించడం చాలా కష్టమైన పని. నాంది లాంటి సినిమాలు చేస్తూ కామెడీ జోనర్ నుంచి దూరం కానని, కామెడీ కొనసాగిస్తానని చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి..
శృతిహాసన్, అమలాపాల్..బోల్డ్‌గా 'పిట్టకథలు' టీజర్
కిస్ ఇవ్వలేదని.. ఆమె నన్ను వదిలేసి వెళ్లింది
రాశీఖన్నాకు నో చెప్పిన గోపీచంద్..!
శింబును వెలేసిన నిర్మాతల మండలి..?
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ ఇతడే..!
చిరంజీవి నన్ను చాలా మెచ్చుకున్నారు..
'వకీల్‌సాబ్' కామిక్ బుక్ కవర్ లుక్ అదిరింది
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.