జైలులో అల్ల‌రి న‌రేశ్‌..ట్రెండింగ్ లో పోస్ట‌ర్

Oct 29, 2020 , 15:04:17

టాలీవుడ్ యాక్ట‌ర్ అల్ల‌రి నరేశ్ న‌టిస్తోన్న తాజా ప్రాజెక్టు నాంది. క్రైం థ్రిల్ల‌ర్ గా వ‌స్తున్న ఈ చిత్రానికి విజ‌య్ క‌న‌క‌మేడ‌ల దర్శ‌కుడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. శంభో శివ శంభో, నేను, ల‌డ్డూబాబు వంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్న న‌రేశ్ ఇపుడు మ‌రో డిఫ‌రెంట్ స్టోరీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు.

తాజాగా నాంది చిత్రంలో అల్ల‌రి న‌రేశ్ సెల్ లో బాధ‌, కోపంతో అరుస్తున్న‌ట్టుగా ఉన్న ఫొటోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. షూటింగ్ పూర్త‌యిన‌ట్టు తెలుపుతూ రిలీజ్ చేసిన‌ ఈ స్టిల్  సినిమాపై ఆస‌క్తిని మ‌రింత పెంచుతుంది. స‌తీశ్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ లాయ‌ర్ గా క‌నిపించ‌నుంది. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. త్వ‌ర‌లో విడుద‌ల‌కు ముస్తాబ‌వుతుంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD