గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 19:51:38

రేపు ఉద‌యం 9‌:09:09 గంట‌ల‌కు అఖిల్ సినిమా ప్ర‌క‌ట‌న

రేపు ఉద‌యం 9‌:09:09 గంట‌ల‌కు అఖిల్ సినిమా ప్ర‌క‌ట‌న

టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంక‌ర త‌న బ్యాన‌ర్ లో వ‌‌రుస ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. వీటిలో మెగాస్టార్ చిరంజీవి చిత్రం కూడా ఉంది. టాలీవుడ్ యువ న‌టుడు అక్కినేని అఖిల్, సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ లో సినిమా రానున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఇద్ద‌రి ప్రాజెక్టును తెర‌కెక్కించే నిర్మాత ఎవ‌ర‌నై దానిపై క్లారిటీ వ‌చ్చింది. అనిల్ సుంక‌ర అఖిల్ ఐదో చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రేపు ఉద‌యం 9.09 గంట‌ల‌కు బిగ్ అనౌన్స్ మెంట్ రానుంది.

సెప్టెంబ‌ర్ 9న ఉద‌యం 9 గంట‌ల 9 నిమిషాల 9 సెకన్ల‌కు అఖిల్ సినిమా ప్ర‌క‌ట‌న‌కు ముహూర్తం ఖ‌రారైంది. ది బోర్న్ ఐడెంటిటీ ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో అఖిల్ గూఢ‌చారి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు టాక్‌. యాక్ష‌న్ డ్రామాగా రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించ‌నున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo