ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 14:31:52

ఫిల్మ్ కెరీర్ కు 20 ఏండ్లు..తొలిసారి చిరుతో న‌టించే ఛాన్స్..!

ఫిల్మ్ కెరీర్ కు 20 ఏండ్లు..తొలిసారి చిరుతో న‌టించే ఛాన్స్..!

క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, విల‌న్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు అజ‌య్. 2000 సంవ‌త్స‌రంలో తొలిసారి కౌర‌వుడు చిత్రంతో సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిశాడు. ఖుషి, విక్ర‌మార్కుడు, ఛ‌త్ర‌ప‌తి, ఒక్క‌డు, ఆర్య 2, గ‌బ్బ‌ర్ సింగ్ వంటి చిత్రాల్లో అజ‌య్ పోషించిన పాత్ర‌లు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయి. అజ‌య్ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చి విజ‌య‌వంతంగా 20 ఏండ్లు పూర్తి చేసుకున్నాడు.  త‌న ఫేవ‌రేట్ యాక్ట‌ర్ చిరంజీవితో ఇన్నాళ్ల‌కు క‌లిసే అవ‌కాశం ద‌క్కించుకున్నాడు అజ‌య్‌. కొర‌టాల శివ, చిరంజీవి కాంబినేష‌న్ లో ఆచార్య చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

మొత్తానికి చిరంజీవితో తొలిసారి స్ర్కీన్ షేర్ చేసుకునే అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాడు అజ‌య్. త‌న 2 ద‌శాబ్దాల ఫిలిం కెరీర్ లో ఇది చాలా గొప్ప జ్ఞాప‌కంగా ఉండిపోయే విష‌యమ‌ని అజ‌య్ చెప్పాడు. చిరుతో క‌లిసి న‌టించే స‌మ‌యం కోసం ఎంతో థ్రిల్లింగ్ గా ఎదురుచూస్తున్న‌ట్టు చెప్పుకొచ్చాడు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo