గురువారం 24 సెప్టెంబర్ 2020
Cinema - Aug 03, 2020 , 15:38:59

పూరీకి స్క్రిప్ట్ వినిపించ‌నున్న అడివి శేష్

పూరీకి స్క్రిప్ట్ వినిపించ‌నున్న అడివి శేష్

హైద‌రాబాద్‌: అడివి శేష్ హీరోగా న‌టించిన చిత్రం గూఢచారి. శ‌శి కిర‌ణ్ టిక్కా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీ బాక్సాపీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసింది. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ తో సీక్వెల్ చేసేందుకు రెడీ అవుతున్నారు అడివి శేష్ అండ్ టీం. అడివి శేష్ న‌టిస్తోన్న తాజా సినిమా మేజ‌ర్ షూటింగ్ పూర్తి కాగానే..గూఢచారి-2 సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అక్టోబ‌ర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న ఈ మూవీ స్టోరీ ఇప్ప‌టికే పూర్త‌యింద‌ట‌. స్క్రీన్ ప్లే ప‌నులు కూడా త్వ‌ర‌లోనూ పూర్తి కానున్నాయ‌ట‌.

అయితే కోవిడ్‌-19 ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్రాజెక్టు లైన్ లోకి రావ‌డానికి కాస్త ఆల‌స్య‌మైంది. అడివి శేష్ ఈ సినిమా క‌థ‌ను రివ్యూ చేసేందుకు త‌న మెంట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ను సంప్ర‌దించ‌నున్నాడు. క‌థ సిద్ద‌మైంది. స్క్రీన్ ప్లే పనులు చేయాల్సి ఉంది. ఎప్ప‌టిలాగే మేం గైడెన్స్ కోసం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌గ్గ‌రికి వెళ్తాం. క‌థపై ఆయ‌న రివ్యూ చేస్తారు అని అడ‌వి శేష్ చెప్పుకొచ్చాడు. ప్ర‌కాశ్ రాజ్‌, జ‌గ‌ప‌తిబాబు, అడివి శేష్, శోభితా దూళిపాళ్ల న‌టించిన గూఢచారి చిత్రానికి అడ‌వి శేష్ క‌థ‌నందించాడు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo