e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home మూవీ ముచ్చట్లు క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న అడవి శేష్

క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న అడవి శేష్

క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న అడవి శేష్

ఇండస్ట్రీలో ఏ అండదండలు లేనప్పుడు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడమే కరెక్ట్. ఇదేదో నోటి లెక్క కాదు.. కొందరు హీరోలు చేసి నిరూపించారు కూడా. తెలుగులో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన విజయ్ దేవరకొండ, నాని లాంటి హీరోలు ఎక్కువగా కాన్సెప్టు సినిమాలే చేశారు. విజయం అందుకున్నారు.. స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత కమర్షియల్ జోనర్‌లోకి వెళ్తున్నారు. ఇప్పుడు అడవి శేష్ కూడా ఇదే చేస్తున్నాడు. ఒక్కో సినిమాతో తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. శేష్ నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా అది హిట్ అనే నమ్మకానికి వచ్చేశారు ఆడియన్స్ కూడా. అంతగా తన సినిమాలతో అందరిలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు.
మొదట్లో పంజా, బాహుబలి, బలుపు లాంటి సినిమాలతో ప్రతినాయకుడిగా ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఇప్పుడు లీడింగ్ హీరోగా మారిపోయాడు. లైన్‌లో సెన్సేషనల్ ప్రాజెక్టులు సెట్ చేశాడు. ఇప్పటికే క్షణం, గూఢాచారి, ఎవరు లాంటి విజయాలతో అడవి శేష్ తన మార్కెట్ భారీగానే పెంచుకున్నాడు.

ఇప్పుడు మరో మూడు సినిమాలు లైన్‌లో పెట్టాడు ఈయన. అందులో మేజర్ అన్నింటికంటే ముందుంది. మహేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. గూఢచారి దర్శకుడు శశికిరణ్ తిక్కా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా మేజర్ వస్తుంది. మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా వస్తుంది.
మరోవైపు గూఢచారి 2 సినిమాలో కూడా నటిస్తున్నాడు అడవి శేష్. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కిస్తున్నాడు ఈయన. దీనికి స్క్రిప్ట్ కూడా శేష్ అందిస్తున్నాడు. ఈ మధ్యే నాని నిర్మాతగా హిట్ 2 సినిమాను కూడా మొదలు పెట్టాడు అడవి శేష్. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నాడు. ఇది కూడా పాన్ ఇండియన్ స్థాయిలో చేయాలని చూస్తున్నాడు నాని. ఏదేమైనా కూడా ఈ మూడు సినిమాలతో అడవి శేష్ మార్కెట్ కనీసం రూ.30 నుంచి రూ.40 కోట్ల వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. కచ్చితంగా రాబోయే రోజుల్లో అడవి శేష్ తన రేంజ్ మరింత పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

వేదం నాగ‌య్య మృతి.. ప్ర‌ముఖుల సంతాపం

గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు

నితిన్ కెరియ‌ర్‌లో సెకండ్‌ హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్..

సిద్ధ‌తో ఆచార్య‌.. మెగా క్రామేడ్స్ లుక్స్ అదుర్స్

ఆదిపురుష్ : గ్రీన్ మ్యాట్‌తోనే స‌గానికి పైగా సినిమా

చ‌ర‌ణ్‌తో స్టైలిష్ ఫొటో దిగిన ఎన్టీఆర్.. పిక్ వైర‌ల్‌

థ్యాంక్యూ బ్రో అంటూ అనుష్క ట్వీట్

అమెరికాలో రెస్టారెంట్ పెట్టిన ప్రియాంకా చోప్రా

‘అరణ్య’ ఫస్ట్ డే కలెక్షన్స్.. రానా దగ్గుబాటికి మరోసారి నిరాశే!

వాయిదా ప‌డ్డ గోపిచంద్ సీటీమార్

సీనియర్ హీరోయిన్ తో ఎఫైర్ .. నిజ‌నిజాలేంటో చెప్పిన క‌మెడీయన్

హిందీలో మాట్లాడిన యాంక‌ర్‌ను ట్రోల్ చేసిన ఏఆర్ రెహ‌మాన్

మాట మార్చిన బన్నీ కూతురు .. వైర‌ల్‌గా మారిన వీడియో

రెస్టారెంట్ వ‌ద్ద విజ‌య్‌దేవ‌రకొండ, ర‌ష్మిక..ఫొటోలు హ‌ల్‌చ‌ల్‌‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న అడవి శేష్

ట్రెండింగ్‌

Advertisement