శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 12:35:47

శ్రీముఖి నోట పెళ్లి మాట‌

శ్రీముఖి నోట పెళ్లి మాట‌

పలు టీవీ షోల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ద‌గ్గ‌రైంది అందాల న‌టి శ్రీముఖి. త‌నదైన పంచ్ డైలాగ్స్ తో కామెడీ ట‌చ్ ఇస్తూ ఆడియెన్స్ ను అల‌రించ‌డం శ్రీముఖికి వెన్న‌తో పెట్టిన విద్య‌. టీవీ షోల‌తోపాటు సినిమాల్లోనూ అల‌రించిన ఈ బ్యూటీ త్వ‌ర‌లోనే గ్లామ‌ర్ ప్ర‌పంచానికి గుడ్ బై చెప్ప‌నుంద‌ని ఇపుడు ఫిలింన‌గ‌ర్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. గ‌తంలో పెళ్లెప్పుడు అని అడిగితే..దాట‌వేస్తూ వ‌చ్చిన శ్రీముఖి..ఈ సారి మాత్రం వెడ్డింగ్ ప్లాన్ పై చాలా క్లారిటీతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ అమ్మ‌డు 2022లో పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయ‌మైన‌ట్టే.

వెబ్ షోలు, సినిమాలు, ఇత‌ర టీవీ ప్రోగ్రామ్ ల‌కు సంత‌కం చేసిన శ్రీముఖి..2022లోపు అన్నింటిని పూర్తి చేసి..వీలైనంత ఎక్కువ‌గా ఆదాయం స‌మ‌కూర్చుకోవాల‌ని భావిస్తోంద‌ట‌. అంతేకాదు పెళ్ల‌యిన త‌ర్వాత  టీవీ షోలు, సినిమాలేవి చేయ‌కుండా త‌న స‌మ‌యాన్ని మొత్తం భ‌ర్త‌కే కేటాయించాల‌నుకుంటున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్. 30వ ప‌డిలోకి అడుగుపెట్ట‌కముందే పెళ్లి తంతును ముగించేయాల‌నుకుంటుంద‌ట శ్రీముఖి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.