మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 22:54:29

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డికి టాలీవుడ్ ప్ర‌ముఖుల నివాళి

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డికి టాలీవుడ్ ప్ర‌ముఖుల నివాళి

విల‌క్ష‌ణ న‌టుడు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతి ప‌ట్ల‌ టాలీవుడ్ ప్ర‌ముఖులు ప్ర‌గాడ సంతాపం తెలియ‌జేశారు.  త‌నదైన శైలి న‌ట‌న‌తో కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకున్న జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు ఆ దేవుణ్ణి ప్రార్థించారు. చిరంజీవి, బాల‌కృష్ణ‌, మోహ‌న్‌బాబు, మ‌హేశ్ బాబు, సుధీర్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఎన్టీఆర్, సునీల్‌, డైరెక్ట‌ర్లు రాజ‌మౌళి, అనిల్ రావిపూడి, గోపీచంద్ మ‌లినేనితోపాటు ప‌లువురు ప్ర‌ముఖులు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డికి నివాళి అర్పించారు. 

సినిమాల‌లో రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిస్ట్ అంటే మొద‌టు గుర్తుకు వ‌చ్చేది జ‌య‌ప్రకాశ్ రెడ్డి గారే. త‌నకంటూ ప్ర‌త్యేక ట్రెండ్ సెట్ చేసుకున్నారు. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని చిరు ట్వీట్ చేశారు. 

రాయ‌ల‌సీమ మాండ‌లికాన్నిత‌న‌దైన బాణీని చూప‌డంలో జ‌య‌ప్రకాశ్ రెడ్డి సిద్ద‌హ‌స్తులు.నాట‌క రంగం నుండి వ‌చ్చిన ఆయ‌న హాస్య న‌టుడిగా, ప్ర‌తినాయ‌కుడిగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్ష‌కుల‌ని మెప్పించారు. గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలో పోలీస్ క‌మీష‌న‌ర్‌గా ఆయ‌న న‌టించారు. పాత్ర ఏదైన చ‌క్క‌గా ఒదిగిపోయేవారు. చిత్ర రంగంలో ఎంత బిజీగా ఉన్నా కూడా నాట‌క‌రంగాన్ని మ‌రువ‌లేదు. తెలుగు, సినీ నాట‌క రంగాల‌కు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మ‌ర‌ణం తీర‌ని లోటు అని ప‌వ‌న్ పేర్కొన్నారు.

ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి గారి మృతి విచారకరం, పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను - నందమూరి బాలకృష్ణ

జయప్రకాష్ రెడ్డి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. మా లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ లో ఎన్నో మంచి పాత్రలు చేశారు. నటుడిగా జయప్రకాష్ రెడ్డి బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఉండేవారు. పదిమందికి సహాయం చెయ్యాలనే వ్యక్తి తను.  జయప్రకాష్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాధున్ని కోరుకుంటున్నాను వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను - - డా. మంచు మోహన్ బాబు

నా ప్రియ‌మైన స్నేహితుడు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి గారి ఆక‌స్మిక మ‌ర‌ణం గురించి విన్న‌ప్పుడు చాలా బాధ ప‌డ్డాను. మాది తెర‌పై అద్భుత‌మైన కాంబినేష‌న్. ఖ‌చ్చితంగా అత‌నిని మిస్ అవుతాం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. కుటుంబంకి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అంటూ వెంకీ ట్వీట్ చేశారు.

భ‌యంక‌ర వార్త‌తో నిద్ర‌లేచాను. జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని సుధ‌ర్ బాబు ట్వీట్ చేశాడు. 

జేపీ గారితో నా ప్ర‌యాణం చాలా ప్ర‌త్యేకం. నా ప్ర‌తీ సినిమాలో ఆయ‌న ఉంటారు. న‌న్ను ఆయ‌న సొంత మ‌నిషిగా భావిస్తారు. ఎంతో ప్రేమ‌తో ఆప్యాయంగా ప‌లుక‌రిస్తారు. జేపీగారిని చాలా మిస్స‌వుతున్నా. ఓ క‌ళాకారుడిగా ఆయ‌న స్థానాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. 

అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.

జయప్ర‌కాశ్ రెడ్డి మ‌ర‌ణం షాకింగ్‌. బాధాక‌రం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని గోపిచంద్ మ‌లినేని ట్వీట్‌చేశాడులోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo