శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 27, 2020 , 17:09:38

ఎలిమినేష‌న్‌లో ట్విస్ట్‌.. బిగ్ బాస్ ఏం చేయబోతున్నాడు?

ఎలిమినేష‌న్‌లో ట్విస్ట్‌.. బిగ్ బాస్ ఏం చేయబోతున్నాడు?

క‌రోనా వ‌ల‌న వినోదం లేక బోరింగ్‌గా ఫీల‌వుతున్న ప్రేక్ష‌కుల‌కు బిగ్ బాస్ షోతో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ద‌క్కుతుంది. రొమాన్స్ , ఫ‌న్‌, ఫ్ర‌స్ట్రేష‌న్ అంతా కూడా ఈ షోలో క‌నిపిస్తుంది. సెప్టెంబ‌ర్ 6న మొద‌లైన సీజ‌న్ 4 నిన్న‌టితో 21 ఎపిసోడ్స్ జ‌రుపుకుంది. ఇంట్లో నుండి ఇద్ద‌రు ఎలిమినేట్ కాగా, ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ రోజు ఆదివారం కావ‌డంతో హౌజ్ నుండి మ‌రొక‌రు ఎలిమినేట్ కానున్నారు. ఆ ఎలిమినేట్ ఎవ‌ర‌నే విష‌యంపై కాస్త సస్పెన్స్ నెల‌కొంది.

బిగ్ బాస్ షోకు సంబంధించిన లీకుల ప‌ర్వం మొద‌టి సీజ‌న్ నుండి కొన‌సాగుతూనే ఉంది. అయితే ఈ లీకుల‌లో కొన్ని కరెక్ట్ అవుతున్న‌ప్ప‌టికీ, మ‌రి కొన్ని మాత్రం పొంత‌న లేకుండా ఉంటున్నాయి. సీజ‌న్ 4 విష‌యానికి వ‌స్తే ఎలిమినేట్ అయిన ఇద్ద‌రికి సంబంధించిన వార్త‌లు ముందుగానే లీక్ అయ్యాయి. ఇక ఈ రోజు మెహ‌బూబ్ హౌజ్‌ను వీడ‌నున్నాడ‌ని నిన్న‌టి నుండి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో బిగ్ బాస్ కొత్త ట్విస్ట్ ఇవ్వ‌నున్నార‌ని అంటున్నారు 

ముందుగా మెహ‌బూబ్ ఎలిమినేట్ కానున్నాడంటూ లీకులు రాగా, తాజాగా యాంక‌ర్ దేవి నాగ వ‌ల్లి ఎలిమినేష‌న్ అవుతుంద‌ని చెబుతున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న ఆమె ఎలిమినేట్ అవుతుందనే విష‌యం న‌మ్మ‌శక్యంగా లేక‌పోయిన‌ప్ప‌టికీ, బిగ్ బాస్ చిన్న ట్విస్ట్‌తో దేవిని ఎలిమినేట్ చేయ‌నున్నాడని తెలుస్తుంది.  అస‌లు ఏం జ‌ర‌గుతుందో తెలియాలంటే కొద్ది గంట‌లు వేచి చూడ‌క త‌ప్ప‌దు మ‌రి. 


logo