e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home సినిమా టీఎన్‌ఆర్‌ కన్నుమూత

టీఎన్‌ఆర్‌ కన్నుమూత

టీఎన్‌ఆర్‌ కన్నుమూత

సినీ జర్నలిస్ట్‌, నటుడు, యూట్యూబ్‌ ఇంటర్వ్యూయర్‌గా మంచి పేరు సంపాదించుకున్న తుమ్మల నర్సింహారెడ్డి( టీఎన్‌ఆర్‌) కరోనాతో మృతి చెందారు. గత కొంతకాలంగా కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీఎన్‌ఆర్‌ పరిస్థితి విషమించడంతో సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. టీఎన్‌ఆర్‌ అనే సంక్షిప్తనామంతో చిత్రసీమలో సుపరిచితుడైన ఆయన ఓ ప్రైవేట్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో ‘ఫ్రాంక్లీ స్పీకింగ్‌ విత్‌ టీఎన్‌ఆర్‌’ కార్యక్రమంతో పాపులర్‌ అయ్యారు. ఎంతో మంది సినీ ప్రముఖుల్ని తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేసి ఆకట్టుకున్నారు. జర్నలిస్ట్‌గా కొనసాగుతూనే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో మెప్పించారు. నేనే రాజు నేనే మంత్రి, సుబ్రహ్మణ్యపురం, ఫలక్‌నూమాదాస్‌, జార్జిరెడ్డి, సవారీ, హిట్‌, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి చిత్రాలు ఆయనకు గుర్తింపును తీసుకొచ్చాయి. దర్శకుడు కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన దేవదాస్‌ కనకాల, ఎల్బీ శ్రీరామ్‌ వద్ద పలు చిత్రాలకు సహాయకుడిగా పనిచేశారు. కొన్ని సినిమాలకు కథా రచనల్లో పాలుపంచుకున్నారు. టీఎన్‌ఆర్‌ మృతితో చిత్రసీమ ఓ ప్రతిభావంతుడిని కోల్పోయిందని సినీ ప్రముఖులు పేర్కొన్నారు. విజయ్‌దేవరకొండ, నాని, అనిల్‌రావిపూడి మారుతి, సందీక్‌కిషన్‌ సోషల్‌మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.

ధైర్యంగా ఉండండి
చివరి సందేశంలో టీఎన్‌ఆర్‌
ఇటీవల విడుదల చేసిన వీడియో లో కరోనాను ఎదురించాలంటే అప్రమత్తంగా ఉండటంతో పాటు మానసిక ైస్థెర్యం ముఖ్యమని టీఎన్‌ఆర్‌ ప్రజల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ఆయన చివరి సందేశంగా చెబుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిం ది. ‘నేను బయటకు వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉం టూ పుస్తకాలు చదువుతున్నా. మంచి సినిమాలు చూస్తున్నా. చెడులో కూడా మంచిని వెతుక్కోవాలని పెద్దలు చెబుతుంటారు. ఈ కష్టసమయం నాకు మంచి అలవాట్లను నేర్పింది. ప్రాణాయామం, యోగా చేయడం నేర్చుకున్నా. ఈ సమయాన్ని కుటుంబంతో సంతోషంగా గడపండి. పిల్లలకు మంచి విషయాలు నేర్పించండి. భవిష్యత్తులో కష్టాల్ని ఎలా ఎదుర్కోవాలో వారికి చెప్పండి. తమ పనుల్ని సొంతంగా చేసుకునేలా పిల్లల్ని తీర్చిదిద్దండి. కరోనా విషయంలో ఇంటిపెద్దలు చాలా భయపడుతున్నారని నేను గమనించా. పెద్దలు భయపడటం ఇంట్లో వాళ్లకు మంచిదికా దు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో ఉంటే కరోనాను జయించవచ్చు. పుకార్లను నమ్మవద్దు. నెగెటివ్‌ వార్తలు చూడకండి. పాజిటివ్‌గా ఉంటే కరోనా మన దరిదాపుల్లోకి రాదు. ఇమ్యూనిటీ పవర్‌పెంచుకొండి. మానసికంగా బలంగా ఉండటానికి ప్రాణాయామం చేయం డి’ అంటూ ఈ వీడియోలో టీఎన్‌ఆర్‌ పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో అందరికి జాగ్రత్తలు సూచించిన టీఎన్‌ఆర్‌ చివరకు ఈ మహమ్మారి బారిన పడి కన్నుమూయడం బాధాకరమంటూ సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తంచేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీఎన్‌ఆర్‌ కన్నుమూత

ట్రెండింగ్‌

Advertisement