దక్షిణాది ఇండస్ట్రీలో హీరో సూర్య (Suriya)కు ఉన్న మార్కెట్ గానీ.. గుర్తింపు కానీ ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. రెండు భాషల్లో కలిపి ఆయన సినిమాలకు దాదాపు 70 కోట్ల మార్కెట్ వుంది. అలాంటి హీరో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడిప్పుడు. ఈయన నిర్ణయాలతో తమిళనాడు థియేటర్ల సంఘం (TN Theatres Association) వ్యతిరేకిస్తుంది. సూర్య చేసే పనులతో థియేటర్ల వ్యవస్థ నాశనమైపోతుంది అంటూ ఆయనపై కోపంతో ఊగిపోతున్నారు తమిళనాడు థియేటర్స్ యూనియన్. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేసే పరిస్థితి లేకపోవడంతో.. భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో తాను నిర్మించిన ‘పొన్మగల్ వంధాల్’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో విడుదల చేసాడు సూర్య.
అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయంపై థియేటర్ల యాజమాన్యాలు – డిస్ట్రిబ్యూటర్స్ – ఎగ్జిబిటర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై సూర్య నిర్మించే సినిమాలను థియేటర్ లలో విడుదల చేయబోమని తీర్మానం చేశారు. అలా చెప్పిన తర్వాత కూడా తాను హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోకే ఇచ్చేసాడు సూర్య. తనకు ఉన్న కోట్లాది రూపాయల అప్పులను బయటి వాళ్లు వచ్చి తీర్చరు కదా.. అందుకే తన సినిమాలు తను ఎక్కడైనా విడుదల చేసుకుంటాను అంటూ అప్పట్లో సూర్య చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇవన్నీ ఇంకా మర్చిపోకముందే ఏకంగా 4 సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియోకు అమ్మేశాడు.
తన సొంత నిర్మాణ సంస్థ 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న జై భీమ్ సినిమాతో పాటు.. ‘రామే ఆండాలుమ్ రావనే ఆండాలుమ్’, ‘ఉదంపిరప్పే’, ‘ఓ మై డాగ్’ చిత్రాలను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు సూర్య. ఈ నాలుగు చిత్రాలు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నాయి. దాంతో థియేటర్ల సంఘం ఇప్పుడు సూర్యపై నిప్పులు కక్కుతున్నారు. ఒక స్టార్ హీరో అయ్యుండి ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటున్నారు అంటూ ఆయనపై మండిపడుతున్నారు. ఒకేసారి నాలుగు సినిమాలు ఓటీటీలో విడుదల చేయడం అనేది ఒక సంచలనం. సూర్య తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
JokkeJokkeMeke Song | ‘జోకే జోకే మేకే’ పుష్ప సాంగ్ ఇంట్రడక్షన్ వీడియో కేక
Meet Cute| జెట్ స్పీడ్లో నాని ‘మీట్ క్యూట్’ షూటింగ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?