శ్రీను సునీల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘తెర కోసం వేషాలు’. మనోజ్ కుమార్ శంబు దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్సాంగ్ని ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సినిమా రంగంలో రాణించాలనుకునే వాళ్లు ఎంత తపన పడుతుంటారో, సినిమా అంటే వాళ్లకు ఎంత ఇష్టమో , సినిమా కోసం ఎలాంటి త్యాగాలు చేయాల్సి వస్తుందో ఈ పాటలో చెప్పడం జరిగింది. తప్పకుండా చిత్రం కూడా అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు