సోమవారం 01 జూన్ 2020
Cinema - May 08, 2020 , 22:40:50

సినీ వర్కర్స్‌కు అండగా..

సినీ వర్కర్స్‌కు అండగా..

కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న డిస్ట్రిబ్యూటర్స్‌, మేకప్‌, క్యాస్టూమ్స్‌తో పాటు ఇతర విభాగాల్లో పనిచేసే సహాయకులకు  నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు పది లక్షల పదకొండు వేల నూటపదకొండు  రూపాయల్ని విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెక్రెటరీ ప్రన్నకుమార్‌, యేలూరు సురేందర్‌రెడ్డికి అందించారు.  గతంలో నిర్మాతలు, ప్రొడక్షన్స్‌ మేనేజర్స్‌కు 20 22, 222 రూపాయల్ని సహాయంగా అందించారాయన.   ‘ కరోనా ప్రభావంతో కష్టాల్ని ఎదుర్కొంటున్న  ఫైటర్స్‌, లేడీ డ్యాన్సర్స్‌తో పాటు ఇతర విభాగాల్లో పనిచేసే సహాయకులకు ఆర్థికంగా బాసటగా నిలవాలనే ఆలోచనతో 10, 11, 111 రూపాయల్ని సహాయం చేశాను. చిత్ర పరిశ్రమలో ఆర్థికంగా వెనుకబడిన కార్మికులకు నాకు చేతనైనంత సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని చదలవాడ శ్రీనివాసరావు తెలిపారు. logo