శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Cinema - Jul 08, 2020 , 12:51:29

నేను వ‌ర్జిన్‌, శాఖాహారి..పెళ్లి చేసుకోమ‌ని న‌టి‌కి ప్ర‌పోజ‌ల్

నేను వ‌ర్జిన్‌, శాఖాహారి..పెళ్లి చేసుకోమ‌ని న‌టి‌కి ప్ర‌పోజ‌ల్

సోష‌ల్ మీడియా ప్రాచుర్యంలోకి వ‌చ్చాక అభిమానులు, సెల‌బ్రిటీల మ‌ధ్య గ్యాప్ చాలా త‌గ్గింది. అభిమానులు త‌మ మ‌న‌సులోని మాట‌ల‌ని సోష‌ల్ మీడియా ద్వారా డైరెక్ట్‌గా త‌మ అభిమాన స్టార్స్‌కి చేర‌వేస్తున్నారు. ఈ క్ర‌మంలో  ఓ అభిమాని త‌న ఫేవ‌రేట్ హీరోయిన్‌కి మ్యారేజ్ ప్ర‌పోజ‌ల్ పెట్టాడు. త‌ను జెన్యూన్ అని చెబుతూ తన‌కున్న కొన్ని క్వాలిఫికేష‌న్స్ న‌టి ముందు పెట్టాడు. దీంతో బిత్త‌ర‌పోయిన స‌ద‌రు న‌టి అత‌గాడికి దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చింది.

థియేట‌ర్ ఆర్టిస్ట్‌గా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన  బాలీవుడ్ నటి తిలోత్తమ షోమ్. మాన్ సూన్ వెడ్డింగ్‌తో డెబ్యూ ఇచ్చిన ఈ అమ్మ‌డు షాంగై, కిస్సా:  ది టేల్ ఆఫ్ ఏ లోన్లీ గోస్ట్‌, చిల్డ్ర‌న్ ఆఫ్ వార్, హిందీ మీడియం ప‌లు చిత్రాల‌లో న‌టించింది. చివ‌రిగా అంగ్రేజీ మీడియంలో కనిపించింది. తాజాగా ఈ అమ్మ‌డికి ఓ అభిమాని  వింత పద్దతిలో ప్రపోజ్ చేశాడు. 

మేడం నేను ఇంకా వర్జిన్ మీరు ఒప్పుకుంటే మిమ్ములను పెళ్లి చేసుకుంటాను. మీతో  జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను వెజిటేరియన్ కూడా. నా గురించి మీరు ఎలా తెలుసుకున్నా ఓకే. బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేసుకోవచ్చు అలాగే లై డిటెక్టర్తో కూడా పరీక్ష చేసుకుని నన్ను పరీక్షించుకోండి. దేనికి అయినా నేను సిద్దంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి స‌ద‌రు హీరోయిన్.. నో థ్యాంక్స్ బైబై బ్ర‌ద‌ర్ అంటూ అత‌ని గుండె ప‌గిలేలా రిప్లై ఇచ్చింది. అభిమాని పోస్ట్ చేసిన కామెంట్‌ని స్క్రీన్ షాట్ తీసి తిలోత్త‌మ త‌న అకౌంట్‌లో పోస్ట్ చేయ‌గా, ఇది వైర‌ల్ అయింది 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo