శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 25, 2021 , 09:15:09

ప్రముఖ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య.. నెల్లూరు టౌన్‌లో కలకలం

ప్రముఖ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య.. నెల్లూరు టౌన్‌లో కలకలం

టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇప్పటికీ వాళ్ల గురించి సోషల్ మీడియాలో వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికీ కొందరు అప్పుడు తమకు వచ్చిన క్రేజ్ ను కంటిన్యూ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దుర్గారావు లాంటి వాళ్లు రచ్చ చేస్తున్నారు. అలాగే దీపిక పిల్లై లాంటి అమ్మాయిలు టిక్ టాక్ నుంచి ఫేమస్ అయి ఇప్పుడు ఈటీవీ ఢీ ఛాంపియన్స్ షోలో యాంకర్ గా ఛాన్స్ కొట్టేసారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఇప్పుడు సంచలనం రేపుతుంది. అతడి పేరు షేక్ రఫీ. ఒకప్పుడు ఈయన టిక్ టాక్‌లో చాలా ఫేమస్. రోజుకు పదుల సంఖ్యలో వీడియోలు అప్ లోడ్ చేసేవాడు. 

అప్పట్లో టిక్ టాక్ లో మిలియన్స్ ఫాలోయర్స్ సంపాదించుకున్నాడు రఫీ. అలాంటి కుర్రాడు ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాడు. నెల్లూరులో కెమెరా మెన్ గా ఉన్నాడు ఈయన. అక్కడ్నుంచే టిక్ టాక్ వీడియోలు కూడా అప్ లోడ్ చేసేవాడు. అయితే ఓ అమ్మాయి కారణంగా ఈయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. రంగనాయకులపేట వాసులు రియాజ్, షాహీనా దంపతులకు మూడో సంతానం షేక్ రఫి. ఈయనకు నారాయణరెడ్డి పేట వాసి ముస్తఫాతో స్నేహం ఏర్పడింది. ముస్తాఫాకు ఓ అమ్మాయితో ప్రేమ ఉండేది. ఆ విషయం రఫీకి కూడా తెలుసు. 

అయితే ముస్తాఫాతో కాకుండా రఫీతో సదరు అమ్మాయి ప్రేమగా ఉండటం.. సన్నిహితంగా ఉండటంతో తట్టుకోలేకపోయిన ముస్తఫా.. స్నేహితులతో వచ్చి ప్లాన్ వేసి మరీ రఫీని కొట్టాడు. తీవ్ర గాయాల పాలైన రఫీ ఇంటికి వచ్చిన తర్వాత ఆస్పత్రిలో చేర్పించాడు రఫీ తండ్రి రియాజ్. ఆ తర్వాత రోజే పోలీసులకు ఫిర్యాదు కూడా చేసాడు. అయితే అప్పట్నుంచే వేధింపులు మరీ ఎక్కువైపోవడంతో జనవరి 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడింది కేవలం వేధింపుల కారణంగానే అని.. ముస్తాఫాపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను డిమాండ్ చేసాడు. పోలీసులు కూడా ధర్యాప్తు మొదలు పెట్టారు.

VIDEOS

logo