మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 23, 2021 , 09:53:16

వ‌రుణ్ ధావ‌న్- న‌టాషా వివాహం.. టైట్ సెక్యూరిటీ ఏర్పాటు

వ‌రుణ్ ధావ‌న్- న‌టాషా వివాహం.. టైట్ సెక్యూరిటీ ఏర్పాటు

బాలీవుడ్ స్టార్ క‌పుల్ వ‌రుణ్ ధావ‌న్- న‌టాషా ద‌లాల్ జ‌న‌వ‌రి 24న పెళ్లి పీట‌లెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ముంబైలోని అలీబాగ్‌లో  వీరిరివురి వివాహ వేడుక జ‌ర‌గ‌నుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి బాలీవుడ్ నుండి ప‌లువురు స్టార్ సెల‌బ్రిటీలు హాజ‌రు కానున్న‌ట్టు తెలుస్తుంది. ఈ రోజు సంగీత్ వేడుక‌ని ప్లాన్ చేయ‌గా, నేటి నుండి పెళ్లి సంబ‌రాలు మొద‌లు కానున్నాయి.

వ‌రుణ్ ధావ‌న్- న‌టాషాల వివాహ వేడుక‌కు కుటుంబ స‌భ్యులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తుంది. ప్రాంగ‌ణం ద‌గ్గ‌ర బౌన్స‌ర్స్, పోలీస్ బందోబ‌స్త్‌, సిసీ కెమెరాలు, ఫ్లెక్సీలు క‌నిపిస్తున్నాయి. మీడియాను కూడా ఈ వేడుక‌కి అనుమ‌తించ‌డం లేద‌ని తెలుస్తుంది.  కాగా, కొన్నాళ్ల‌పాటు డేటింగ్‌లో ఈ జంట ఎట్ట‌కేల‌కు వివాహం చేసుకునేందుకు సిద్ద‌మ‌య్యారు. గ‌త ఏడాది చేసుకోవాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ, కరోనా వ‌ల‌న స్మాల్ బ్రేక్ తీసుకున్నారు. 

VIDEOS

logo