kaizzad capadia | ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకటి మరిచిపోయే లోపు మరొకటి బలంగా తాకుతున్నాయి. తాజాగా మరో విషాద సంఘటన జరిగింది. బాలీవుడ్లో ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్‌గా గుర్తింపు సంపాదించుకున్న కైజాద్ కపాడియా ( kaizzad capadia ) కన్నుమూశారు. స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ ( Tiger Shroff ) సహా చాలామంది హీరోలకు ఫిట్నెస్ ట్రైనర్‌గా పని చేసిన అనుభవం కైజాద్ కపాడియా సొంతం. ఎప్పుడూ చురుగ్గా, అత్యంత ఆరోగ్యకరంగా ఉండే ఈయన అక్టోబర్ 13న ఉదయం కన్ను మూశాడు. తనదైన ట్రైనింగ్‌తో బాలీవుడ్లో చాలామంది హీరోలకు ఫేవరెట్ ఫిట్ నెస్ ట్రైనర్‌గా మారిపోయాడు కైజాద్. ఎంతో మంది జీవన శైలిని మార్చేశాడు ఈయన.
అలాంటి వ్యక్తి హఠాన్మరణం చెందిన విషయం తెలుసుకుని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. టైగర్ ష్రాఫ్ అయితే తన ట్రైనర్ చనిపోయిన విషయం తెలుసుకొని కన్నీరు పెట్టుకున్నాడు. సోషల్ మీడియాలో ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పాడు. టైగర్ టైగర్ తల్లి ఆయేషా, సిద్ధాంత్ కపూర్, నీల్ నితిన్ ముకేశ్, డేన్నీ పాండే, రుస్లాన్ ముంతాజ్ తదితరులు కూడా కైజాద్ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
బాలీవుడ్లో చాలామంది ఫిట్ నెస్ ట్రైనర్స్ కైజాద్ను గురువుగా భావిస్తుంటారు. అయితే ఆయనెప్పుడూ సెలబ్రిటీస్ ట్రైనర్ అనే భావనను తలకు ఎక్కించుకోలేదు. అందరిని నవ్వుతూ పలకరించే వాడు అంటున్నారు ఆయన సన్నిహితులు. కైజాద్ మరణానికి అసలైన కారణాలు బయటికి రాలేదు. ఇదిలా ఉంటే పలువురు అభిమానులు అంతిమ సంస్కారంలో పాల్గొనడానికి పుణె బయలుదేరి వెళ్లారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Brahmanandam | జబర్దస్త్ కమెడీయన్‌ను ఫాలో అవుతున్న బ్రహ్మానందం!
టాలీవుడ్ నిర్మాతలకు ఏపీ సీఎం జగన్ తీపికబురు.. దసరాకు ముందు బంపర్ ఆఫర్..
Maha Samudram pre release | మహా సముద్రం ప్రివ్యూ.. జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..?
ముక్కలైపోతున్న మా అసోసియేషన్.. సో కాల్డ్ సినీ పెద్దలేం చేస్తున్నారో..?
కాను కానంటూనే సినీ పెద్దవుతున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు !
Avika Gor | ఆ అనుభవం చాలా నేర్పించింది: అవికాగోర్