శనివారం 06 జూన్ 2020
Cinema - May 11, 2020 , 10:07:32

సుధీర్ బాబుకి బ‌ర్త్‌డే విషెస్ అందించిన బాలీవుడ్ హీరో

సుధీర్ బాబుకి బ‌ర్త్‌డే విషెస్ అందించిన బాలీవుడ్ హీరో

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బావ సుధీర్ బాబు టాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స‌మ్మోహ‌నం చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన సుధీర్ త్వ‌ర‌లో వి అనే చిత్రంతో ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఇంద్ర‌గంటి మోహ‌న్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో నాని కూడా ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

ఈ రోజు సుధీర్ బాబు బ‌ర్త్ డే కావ‌డంతో ఆయ‌న‌కి ప‌లువురు ప్రముఖుల నుండి విషెస్ అందుతున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. రానున్న రోజుల‌లో మనం క‌లిసి మరిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.  టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన భాఘీ సినిమాలో సుధీర్ బాబు విల‌న్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. కాగా,  ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన ఆయ‌న ఫిట్‌నెస్‌కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ వ‌స్తున్నాడు. రీసెంట్‌గా దాన‌వీర‌శూరక‌ర్ణ సినిమాలోని ఏమంటివి అనే డైలాగ్‌ని గుక్క‌తిప్పుకోకుండా చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాడు.


logo