శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 00:33:25

యథార్థ ఘటనల థ్రిల్లర్‌

యథార్థ ఘటనల థ్రిల్లర్‌

కరీంనగర్‌ జిల్లాలోని ఓదెలలో జరిగిన యథార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్‌'. అశోక్‌తేజ దర్శకుడు. సంపత్‌నంది కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణల్ని అందిస్తున్నారు. వశిష్టసింహ, హెబాపటేల్‌, సాయిరోనక్‌, పూజితా పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ అనుదీప్‌ పాత్రలో సాయిరోనక్‌ నటిస్తున్నారు. ఆయన పాత్ర తాలూకు లుక్‌ను శనివారం విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఓదెల గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న వైవిధ్యమైన థ్రిల్లర్‌ కథ ఇది. ప్రతి సన్నివేశం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్‌.సౌందర్‌రాజన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: సంపత్‌నంది, దర్శకత్వం: అశోక్‌తేజ.


logo