గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 08:08:42

నామినేష‌న్‌లో తొమ్మిది మంది.. ముగ్గురిని సేవ్ చేసిన నాగ్

నామినేష‌న్‌లో తొమ్మిది మంది.. ముగ్గురిని సేవ్ చేసిన నాగ్

బుల్లితెర బిగ్ బాస్ సీజన్ 4 కార్య‌క్ర‌మం నేటితో స‌క్సెస్‌ఫుల్‌గా ఆరు వారాలు పూర్తి చేసుకోనుంది. ఇప్ప‌టికే  ఐదుగురు ఇంటి స‌భ్యులు బిగ్ బాస్ హౌజ్‌ను వీడ‌గా, నేడు ఒక‌రు ఎలిమినేట్ కానున్నారు. మొత్తం నామినేష‌న్‌లో తొమ్మిది మంది ఇంటి స‌భ్యులు ( కుమార్ సాయి, అఖిల్‌, మోనాల్‌, నోయ‌ల్‌, హారిక‌, అభిజిత్‌, దివి, అరియానా,లాస్య ) ఉన్నారు. వీరిలో ముగ్గురిని శ‌నివారం ఎపిసోడ్‌లో సేవ్ చేశారు నాగార్జున‌.

నామినేష‌న్స్‌లో ఉన్న వారికి క‌వ‌ర్స్ ఇచ్చి అందులో ఎవ‌రికి అయితే ప‌చ్చి మిర్చి వ‌స్తాయో వారు సేవ్ అయిన‌ట్టు అని నాగ్ చెప్పారు. లాస్య కి ఇచ్చిన ప్యాక్‌లో మొత్తం గ్రీన్ చిల్లి ఉండ‌డంతో ఆమె సేవ్ అయిన‌ట్టు ప్ర‌క‌టించారు నాగార్జున. ఇక హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న నోయల్‌ని నీకు సేవ్ చేసే అధికారం ఇస్తే ఎవర్ని సేవ్ చేస్తావ్.. అని నాగ్ అడగడంతో హారిక పేరు చెప్పాడు. అంద‌రు గేమ్ బాగా ఆడారు, కాని హారిక చేసిన త్యాగం గొప్ప‌ది అని నోయ‌ల్ చెప్పాడు. అయితే అత‌నిని స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న కాయిన్ తీసుకుర‌మ్మ‌ని అన్న నాగ్ ఇంటి స‌భ్యుల ముందు ఓపెన్ చేయాల‌ని చెప్పాడు. నాగ్ చెప్పిన వెంట‌నే ఆ కాయిన్‌ని రెండో వైపుకి తిప్ప‌గా హారిక ఫోటో రావ‌డంతో ఆమె సేవ్ అయిన‌ట్టు ప్ర‌క‌టించారు నాగార్జున‌.

మొత్తంగా ఆరోవారం నామినేషన్స్‌లో ఉన్న తొమ్మది మందిలో నోయల్, హారిక, లాస్య‌లు సేవ్ అయ్యారు. మిగిలిన ఆరుగురిలో ఒక‌రు నేడు ఇంటి నుండి బ‌య‌ట‌కు వెళ్ళ‌నున్నారు. ఇక హాఫ్ షేవ్ చేయించుకున్న కార‌ణంగా స్పెష‌ల్ ఇమ్యునిటీ పొందిన అమ్మ రాజశేఖ‌ర్ వ‌చ్చే వారం త‌ను నామినేష‌న్ నుండి సేవ్ అయ్యారు.  

ఎపిసోడ్ మ‌ధ్య‌లో ఇంటి స‌భ్యులు ఒక‌రి గురించి ఒక‌రు ఏమ‌న‌కుంటున్నారో నాగ్ చ‌దివి వినిపించారు. హౌజ్ మేట్స్ పేప‌ర్స్ మీద త‌మ అభిప్రాయాల‌ని రాసి పంప‌గా నాగార్జున చ‌దివారు. ముందుగా ..  అవినాష్‌ది టాస్కు స‌మ‌యంలో క్రూర మ‌న‌స్త‌త్వం అని ఒక‌రు రాసారు అది ఎవ‌రో గెస్ చేసి వారిని త‌ల‌పై సుత్తితో కొట్టాలి. నువ్వు రాంగ్‌గా గెస్ చేస్తే వాళ్లే తిరిగి కొడ‌తార‌ని నాగ్ అన్నారు. అయితే త‌న‌పై ఈ ఆరోప‌ణ‌లు చేసింది దివి అని గెస్ చేశారు అవినాష్‌. అది క‌రెక్ట్ అని చెప్పుకొచ్చారు నాగ్

ఇక మెహ‌బూబ్ ఫ్రెండ్‌షిప్ స‌ర్కిల్ సెట్‌ చేసుకుని వారిని వాడుకోవాల‌నుకుంటాడు. స్వార్థప‌రుడు కానీ స్నేహం కోసం చేస్తున్న‌ట్టు క‌ల‌ర్ ఇస్తాడు అని   కుమార్ సాయి త‌న అభిప్రాయాన్ని పేప‌ర్‌లో రాసాడు. లాస్యది మోస‌పూరిత న‌వ్వు అని  అమ్మ రాజ‌శేఖ‌ర్ చెప్పారు. అభిజిత్‌కు చాలా అహంకారం అని దివి రాసింది. అయితే అభిజిత్‌.. అఖిల్ రాసాడ‌ని త‌ప్పుగా గెస్ చేయ‌డంతో రివ‌ర్స్ పంచ్ ఇచ్చాడు అఖిల్.

నోయ‌ల్‌ది తాత్కాలిక స్నేహం అని  అవినాష్ రాయ‌గా, అరియానా అతిగా స్పందించ‌డం, పాడ‌టం కొన్నిసార్లు హ‌ద్దులు దాటుతుంది అని మెహ‌బూబ్  అన్నాడు.  దివి.. అహంకారం, అగౌర‌వం, స‌భ్య‌త లేకుండా ఉంటుంది, ఇత‌ర మ‌నోభావాల‌ను ప‌ట్టించుకోదు అని  మోనాల్ రాసింది.  అఖిల్‌ నిజాయితీప‌రుడిగా, ఎటువంటి వంచ‌న లేని మ‌నిషిగా న‌టిస్తాడు అని అభిజిత్ అన్నాడు. మోనాల్‌ అబద్ధాల కోరు అని ,  అమ్మ రాజ‌శేఖ‌ర్‌ ఏం అరుస్తాడో, నిజాయితీ అన్న ముసుగు ఎలాగైతా ఉండాల‌నుకుంటున్నాడో అందులో దాచుకుంటాడు అని త‌న అభిప్రాయాల‌ని చెప్పాడు అభిజిత్. 


logo