మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Oct 31, 2020 , 01:53:32

పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌లో మూడు చిత్రాలు

పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌లో మూడు చిత్రాలు

యానిమేషన్‌ గేమింగ్‌ రంగంలో పేరుపొందిన యువ వ్యాపారవేత్త, ఇటీవల ప్రకటించిన ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సంపాదించుకున్న కొవ్వూరి సురేష్‌రెడ్డి తెలుగు చిత్రసీమలోకి నిర్మాతగా అరంగేట్రం చేశారు. ‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌' పతాకంపై ఆయన సినిమాల్ని నిర్మించబోతున్నారు. శుక్రవారం మూడు సినిమాల్ని ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ మూడు సినిమాల ప్రీలుక్స్‌, లోగోలను ప్రసాద్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ రమేష్‌ప్రసాద్‌, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆవిష్కరించారు. ప్రొడక్షన్‌ నెం1గా రూపొందించబోతున్న చిత్రం ద్వారా ఆకాష్‌రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. రెండో చిత్రానికి ‘రుషి’ ఫేమ్‌ రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రాన్ని ఎన్నారై రవికాంత్‌ జామితో కలిసి సురేష్‌రెడ్డి నిర్మించబోతున్నారు. మూడో చిత్రానికి ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహించనున్నారు. దీనికి రమేష్‌ప్రసాద్‌ సమర్పకులుగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌లో కొన్ని సినిమాలు నిర్మించాం. మేం సినీ నిర్మాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాం. నేడు మూడు సినిమాల్ని ఆరంభించడం ఆనందంగా ఉంది’ అన్నారు. నూతన నిర్మాణ సంస్థను మొదలుపెట్టి మూడు సినిమాల్ని తెరకెక్కించడం గొప్ప విషయమని, ఈ ప్రయత్నం విజయవంతమవ్వాలని దిల్‌రాజు ఆకాంక్షించారు. నిర్మాత కొవ్వూరి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ “కంటెంట్‌ ఈజ్‌ ది కింగ్‌' అనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. వచ్చే నాలుగేళ్లలో 20 చిత్రాల్ని నిర్మించే ఆలోచనతో ఉన్నాం. ఈ మూడు చిత్రాలకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అన్నారు.