శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 14, 2020 , 13:40:40

ఇద్ద‌రు స్టార్ హీరోల‌కు బెదిరింపు కాల్స్..!

ఇద్ద‌రు స్టార్ హీరోల‌కు బెదిరింపు కాల్స్..!

ఇద్ద‌రు కోలీవుడ్ స్టార్ హీరోల‌కు బెదిరింపు కాల్స్ రావ‌డం త‌మిళ‌నాట క‌ల‌క‌లం రేపుతోంది. మంగ‌ళ‌వారం కోలీవుడ్ స్టార్ హీరోలు ధ‌నుస్, విజ‌య్ కాంత్ ఇండ్ల‌లో బాంబులు పెట్టిన‌ట్టు పోలీస్ కంట్రోల్ రూంకు కాల్స్ వ‌చ్చాయి. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి పోలీస్ కంట్రోల్ రూంకు రెండుసార్లు ఫోన్ చేసి చెన్నైలోని అభిరామ‌పురంలో ఉన్న ధ‌నుష్ ఇంటితోపాటు విరుగంబాక్క‌మ్‌లోని విజ‌య్ కాంత్ ఇంట్లో బాంబుల పెట్టిన‌ట్టు చెప్పాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ చేయ‌గా ఫేక్ కాల్ అని తేలింది.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. రెండు ఫోన్ కాల్స్ ఓ వ్య‌క్తి నుంచి వ‌చ్చాయ‌ని గుర్తించిన పోలీసులు..ఎక్క‌డి నుంచి ఫోన్ కాల్స్ వ‌చ్చాయ‌నే విషయంపై ద‌ర్యాప్తు చేస్తున్నారు. ధ‌నుష్ ప్ర‌స్తుతం త‌న కొత్త సినిమా షూటింగ్ తో బిజీగా ఉండ‌గా..విజ‌య్ కాంత్ ఇటీవ‌లే కోవిడ్‌-19 బారి నుంచి కోలుకున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.