బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో నామినేషన్ ప్రక్రియలో భాగంగా ప్రియ.. లహరి దారుణమైన కామెంట్స్ చేసింది. లేట్ నైట్ వాష్ రూంలో రవిని హగ్ చేసుకున్నావ్ అని, అబ్బాయిలతోనే ఎక్కువగా ఉంటావని ప్రియ సంచలన కామెంట్స్ చేసింది. దీనికి స్పందించిన లహరి.. రవి అంటే నాకు బ్రదర్ లా చూశా. మా ఇంట్లో వాళ్లని రిక్వెస్ట్ చేశా.. నా బ్రదర్ బర్త్ డే షర్ట్ పంపించండి అని.. నువ్ ఏం మాట్లాడుతున్నావ్.. కనీసం సంస్కారం లేకుండా? అని ఊగిపోయింది లహరి.
రవి కూడా స్పందిస్తూ.. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్… బాత్ రూంలో హగ్ చేసుకున్నారని నువ్ అంటే చూసే జనం ఏం అనుకుంటారు అని అరిచాడు. నేను లహరి కంటే సిరి, కాజల్‌తో ఎక్కువగా ఉంటాను, అప్పుడు లేని సమస్య లహరి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వస్తుంది? అందరిని నువ్వు దోషులుగా ఎందుకు చూపిస్తున్నావు అని ప్రియపై ఫైర్ అయ్యాడు రవి.
లహరి నాకు హగ్ ఇచ్చిందనే కదా అంటున్నారు. అది జస్ట్ హగ్గే.. దానికి మీరు ఎంత కలరింగ్ ఇచ్చారు.. మిడ్ నైట్.. టాయ్ లెట్లో అని చెప్పడం ఎంతవరకూ కరెక్ట్ అని అడిగాడు. ‘మీరు హగ్ చేసుకున్నది మిడ్ నైట్ కాదా? టాయ్ లెట్లో కాదా? అని తిరిగి ప్రశ్నించింది ప్రియ. దీనికి రవి.. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎలా పడితే అలా స్టేట్మెంట్స్ ఇస్తే మంచిది కాదు అంటూ రవి ఊగిపోయాడు. మొత్తానికి ప్రియ.. రవి, లహరిల గురించి దారుణంగా మాట్లాడి వాళ్ల గుట్టు మొత్తం బయటపెట్టేసింది.
ప్రియ.. సన్నీని కూడా నామినేట్ చేస్తూ అతని ప్రవర్తన నచ్చలేదని అనడంతో సన్నీ కూడా ఊగిపోయాడు. ఒక అమ్మాయి గురించి ఇంత దారుణంగా మట్లాడారు. నన్ను వీడు వాడు అనలేదా? హగ్ చేసుకుంటే అదేమైన తప్పా? ఇంత సీన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డాడు సన్నీ.
రవి మళ్లీ అందుకొని.. ప్రియ గారూ.. దయచేసి మా మధ్య బ్రదర్ సిస్టర్ రిలేషన్ తప్ప మరేం లేదు. మా మధ్య హెల్దీ రిలేషన్ మాత్రమే ఉంది.. ఓ హగ్ కూడా తప్పు అంటే అది మీ ఆలోచన.. అది తప్పు అని చెప్పాడు రవి. దీంతో ప్రియ మోకాళ్లపై కూర్చుని.. చేతులు జోడించి.. అందరి మగాళ్లకి సారీ.. నేను చూసింది టైం ప్లేస్ అన్నీ అబద్దాలే చెప్పానని అనుకోండి. ఐ యామ్ సారీ లహరి అని చెప్పింది ప్రియ. ఆ తర్వాత కూడా కొద్ది సేపు డిస్కషన్ జరిగింది. మొత్తానికి సోమవారం ప్రియ అగ్నికి ఆజ్యం పోసింది.
మొత్తంగా ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే..