గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 17, 2020 , 17:43:44

మ‌రోసారి గాయ‌నిగా మారిన హీరోయిన్‌

మ‌రోసారి గాయ‌నిగా మారిన హీరోయిన్‌

అలా మొద‌లైంది సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించి..త‌క్కువ కాలంలోనే బిజీగా హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది నిత్య‌మీన‌న్‌. న‌టిగానే కాకుండా గాయ‌నిగా కూడా త‌న‌ను తాను నిరూపించుకుంది. గ‌తంలో ఈ భామ ప‌లు హిట్ సాంగ్స్ ను పాడింది. తాజాగా ఈ బ్యూటీ మ‌రోసారి త‌న సినిమా కోసం సింగ‌ర్ గా మారింది. నిన్నిలా నిన్నిలా అంటూ సాగే పాట‌ను నిత్య‌మీన‌న్ పాడింది. ఇటీవ‌లే బెంగ‌ళూరులోని ర‌ఘుదీక్షిత్ స్టూడియోలో ఈ పాట‌ను రికార్డు చేశారు టీం.  టైటిల్ ఫిక్స్ కానీ ఈ  సినిమా అని శ‌శి డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతోంది.

అశోక్ సెల్వ‌న్‌, రీతూవ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌రోవైపు నిత్య‌మీన‌న్ యూకేకు చెందిన స‌రోద్ ప్లేయ‌ర్ సౌమిక్ ద‌త్తాతో క‌లిసి రూపొందిస్తున్న తొలి ఇంగ్లీష్ సాంగ్ ను విడుద‌ల చేసేందుకు సిద్ద‌మ‌వుతుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo