శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 15, 2021 , 17:03:48

సంక్రాంతి విజేత ఒక్కరా..ఇద్దరా..? ర‌వితేజ‌కు పోటీగా మ‌రొక‌రు

సంక్రాంతి విజేత ఒక్కరా..ఇద్దరా..? ర‌వితేజ‌కు పోటీగా మ‌రొక‌రు

ఇప్పుడు ఈ అనుమానం ఒక్కర్లో ఇద్దరిలో కాదు చాలా మందిలో కనిపిస్తుంది. సంక్రాంతి విజేత ఎవరంటే మరో అనుమానం లేకుండా నూటికి 90 మంది ఇప్పుడు ఒకే సినిమా పేరు చెప్తున్నారు. అదే క్రాక్.. అందరికంటే ముందుగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాడు రవితేజ. చాలా ఏళ్ళ తర్వాత ఈయన హిట్ కొట్టడమే కాదు..10 నెలల తర్వాత ప్రేక్షకులను థియేటర్ వైపు నడిపించడంలో సక్సెస్ అయ్యాడు మాస్ రాజా. ఇప్పటి వరకు 5 రోజుల్లో దాదాపు 15 కోట్ల షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ కు కోటి దూరంలోనే ఉన్నాడు మాస్ రాజా. సినిమాకు అదిరిపోయే టాక్ ఉండటంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో కూడా వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తున్నాడు రవితేజ. చాలా ఏళ్ళ తర్వాత ఈయన పోలీస్ ఆఫీసర్ గా నటించడం..స్క్రీన్ ప్లే సూపర్ ఫాస్టుగా వెళ్లడంతో పిచ్చెక్కిస్తున్నాడు మాస్ రాజా.

ఇదిలా ఉంటే ఈయనతో పాటు మరొకరు కూడా సంక్రాంతి విజేత ట్యాగ్ లైన్ కోసం పోటీలో ఉన్నారు. అతడే దళపతి విజయ్. ఈయన నటించిన మాస్టర్ సినిమాకు నిజానికి యావరేజ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు చూస్తుంటే మాత్రం అలా కనిపించడం లేదు. తొలి రోజే ఊహకందని స్థాయిలో 5.7 కోట్ల షేర్ వసూలు చేసి దాదాపు 80 శాతం రిటర్న్స్ తీసుకొచ్చింది మాస్టర్. రెండోరోజు కూడా దాదాపు 2 కోట్ల వరకు షేర్ రాబట్టి రాక్ స్టడీగా ఉన్నాడు మాస్టర్.

ఈయన దూకుడు చూస్తుంటే కచ్చితంగా మరో 3 కోట్ల వరకు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అల్లుడు అదుర్స్ డిజాస్టర్ కావడం..రెడ్ సినిమాకు కూడా టాక్ బాగోలేకపోవడంతో అందరూ మాస్టర్, క్రాక్ వైపు అడుగులేస్తున్నారు. ముఖ్యంగా మాస్టర్ సినిమాలో విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ కు తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. దాంతో కలెక్షన్స్ ఇప్పటికీ బాగానే వస్తున్నాయి.

అందుకే ఈ సారి మాస్టర్ కూడా సంక్రాంతి విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వచ్చిన టాక్‌కు.. వస్తున్న వసూళ్లకు ఏ మాత్రం పొంతన లేదు. దాంతో క్రాక్‌ మసాలాలతో పాటు ఈ పొంగల్‌కు సాంబార్ కూడా బాగానే టేస్ట్ వచ్చింది. విజయ్ నటించిన గత మూడు సినిమాలు అదిరింది, సర్కార్, విజిల్ తెలుగులోనూ విజయం సాధించాయి. ఇప్పుడు మాస్టర్ కూడా సేఫ్ జోన్ కు వచ్చేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమాను 9 కోట్లకు కొన్నారు. ఇప్పటికే రెండు రోజుల్లోనే 7.5 కోట్ల షేర్ వసూలు చేసింది మాస్టర్. దాంతో కచ్చితంగా హిట్ బొమ్మ అయ్యేలా కనిపిస్తుంది. మరోవైపు క్రాక్ కూడా మంచి లాభాలు తీసుకొచ్చేలా ఉంది. ఎలా చూసుకున్నా కూడా ఈ పండక్కి రెండు సినిమాలు విజేతలు కావడం లాంఛనమే.

ఇవి కూడా చ‌ద‌వండి

పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌భాస్ 'స‌లార్' షురూ

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo