శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 08, 2021 , 18:19:19

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?

అచ్చమైన తెలుగు పండగను పట్టుకొని ఇంగ్లీష్ ఫెస్టివల్ అంటారేంటి అనుకుంటున్నారా..? వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఈసారి సంక్రాంతి మాత్రం పూర్తిగా ఇంగ్లీష్ అయిపోయింది. అదెలా అనే అనుమానం రావచ్చు. సాధారణంగా సంక్రాంతి వస్తే రైతులకు ఎంత ప్రాముఖ్యత ఉందో సినిమాలు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. చాలా కొత్త సినిమాలు ఈ పండుగకు వస్తుంటాయి. ఈసారి కరోనా వైరస్ ఉన్నా కూడా మూడు భారీ సినిమాలు సంక్రాంతి పండుగకు విడుదల అవుతున్నాయి. ఇక్కడే అసలు విషయం ఉంది. జనవరి 9న రవితేజ నటించిన క్రాక్ విడుదలవుతుంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోసారి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు రవితేజ. 

ఇదిలా ఉంటే ఈ సినిమా వచ్చిన నాలుగు రోజులకు జనవరి 13న విజయ్ మాస్టర్ సినిమా విడుదల కానుంది. దీనిపై కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. తెలుగులో కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు అభిమానులు. మరోవైపు జనవరి 14న రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్ సినిమా విడుదల కానుంది. తమిళంలో మంచి విజయం సాధించిన తడమ్ సినిమాకు ఇది రీమేక్. అల్లుడు అదుర్స్ కూడా ఈ సంక్రాంతికి రావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో వాయిదా వేశారు.

ఇప్పుడు పండక్కి వస్తున్న మూడు సినిమాల టైటిల్స్ ఒక్కసారి గమనించండి. ఒక్కటంటే ఒక్కటి కూడా తెలుగు టైటిల్ లేదు. మూడుకు మూడు ఇంగ్లీష్ టైటిల్స్. రవితేజ క్రాక్ అంటూ కిరాక్ పుట్టించడానికి వస్తున్నాడు. మాస్టర్ అంటూ పాఠాలు చెప్పడానికి వస్తున్నాడు విజయ్. ఇంకోవైపు సస్పెన్స్ ధ్రిల్లర్ రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రామ్. ఈ మూడు సినిమాలు వేటికవే భిన్నం. కాకపోతే అన్ని సినిమాలు మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్ టైనర్లు. అందుకే అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇలా ఈ పండుగ మొత్తం ఇంగ్లీష్ మయం అయిపోయింది. మరి వీటిలో ఏది ప్రేక్షకుల మనసులు దోచుకుంటుందో చూడాలి. అన్నట్లు ఈ మూడు సినిమాలు కలిపి దాదాపు 300 కోట్ల బిజినెస్ చేస్తున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి


జూనియర్ ఎన్టీఆర్ తొలి పారితోషికం ఎంతంటే..?

2021-టాలీవుడ్ ఫ్యూచర్ డిసైడ్ చేసేది ఈ సినిమాలే..!


హాట్ టాపిక్‌గా మారిన ప్ర‌భాక‌ర్ పారితోషికం

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo