శనివారం 28 నవంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 18:49:14

ప్రొడ్యూస‌ర్ల పాలిట‌ విలన్ గా 'రియ‌ల్ హీరో'

ప్రొడ్యూస‌ర్ల పాలిట‌ విలన్ గా 'రియ‌ల్ హీరో'

చిన్న చిన్న పాత్ర‌ల‌తో కెరీర్ ప్రారంభించి త‌న యాక్టింగ్ తో స్టార్ సెల‌బ్రిటీగా మారాడు సోనూసూద్‌. లాక్ డౌన్ కాలంలో విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న వేలాది మందికి అండ‌గా నిలిచి రియ‌ల్ హీరోగా మారాడు. ఇటీవ‌లే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టిస్తోన్న అల్లుడు అదుర్స్ సెట్స్ కు వ‌చ్చిన సోనూసూద్ ను చిత్ర‌యూనిట్ ఘ‌నంగా స‌త్క‌రించారు. అయితే అంద‌రితో రియ‌ల్ హీరో అనిపించుకుంటున్న ఈ స్టార్ యాక్ట‌ర్‌..నిర్మాత‌ల పాలిట మాత్రం విల‌న్ గా మారాడ‌ని ఇపుడు ఫిలింన‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది.

బోయ‌పాటి శ్రీను-బాల‌కృష్ణ కాంబినేష‌న్ లో వ‌స్తున్న బీబీ3 చిత్రం కోసం విల‌న్ గా సోనూసూద్ ను సంప్ర‌దించార‌ట నిర్మాత‌లు. అయితే సోనూసూద్ మాత్రం రూ.4 కోట్లు రెమ్యున‌రేష‌న్ ను డిమాండ్ చేశాడ‌ట‌. ఇటీవ‌లే మ‌రో నిర్మాత కూడా సోనూసూద్ నుంచి ఇలాంటి షాక్ నే ఎదుర్కొన్నాడ‌ట‌. మ‌రి అల్లుడు అదుర్స్ చిత్రం కోసం సోనూసూద్ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడ‌నేది తెలియాల్సి ఉంది. మొత్తానికి సోనూసూద్ నిర్మాత‌ల నుంచి భారీ మొత్తంలోనే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటూ పేద‌ల‌కు పంచుతున్నార‌న్న‌మాట‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.