శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 02, 2020 , 13:24:24

ర‌వితేజ విల‌న్ గా పాపుల‌ర్ హీరో..!

ర‌వితేజ విల‌న్ గా పాపుల‌ర్ హీరో..!

టాలీవుడ్ హీరో ర‌వితేజ క్రాక్ సినిమా విడుద‌ల కాక‌ముందే ఖిలాడీ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీల‌క అప్ డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. తెలుగు, త‌మిళ, క‌న్న‌డ భాష‌ల్లో హీరోగా న‌టించి యాక్ష‌న్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు అర్జున్. ఈ పాపుల‌ర్ హీరో ఖిలాడీ చిత్రంలో విల‌న్ గా న‌టిస్తున్నాడ‌నే వార్త ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

భారీ బ‌డ్జెట్‌తో వ‌స్తోన్న ఈ చిత్రంతో అర్జున్ పాత్ర చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంద‌ని టాలీవుడ్ వ‌ర్గాల బోగ‌ట్టా. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్నారు. ర‌వితేజ‌-గోపీచంద్ మ‌లినేని కాంబోలో వ‌స్తున్న క్రాక్ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ ప్రాజెక్టులో శృతిహాస‌న్ హీరోయిన్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.