ఎఫ్3లో మరో మెగా హీరో స్పెషల్ రోల్..?

టాలీవుడ్ యాక్టర్లు వెంకటేశ్-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తోన్న ప్రాజెక్టు ఎఫ్ 3. 2018లో వచ్చిన ఎఫ్ 2..ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్ 3 షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సారి మరో టాలీవుడ్ హీరో ఈ చిత్రంలో స్పెషల్ రోల్ లో కనిపిస్తాడని ప్రచారం నడుస్తోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మెగా సుప్రీమ్ హీరో సాయిధరమ్‌తేజ్ ఎఫ్ 3లో భాగం కానున్నట్టు టాక్.అనిల్ రావిపూడి-సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన సుప్రీం చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.
అప్పటి నుంచి అనిల్-సాయిధరమ్ తేజ్ స్నేహితులుగా మారిపోయారు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం కారణంగానే ఎఫ్ 3లో కీలక పాత్ర చేసేందుకు సాయిధరమ్ సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడనుందట. ఈ సారి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తోపాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ను కూడా బాగానే చూపించనున్నాడట అనిల్ రావిపూడి. అంతేకాదు సెకండ్ పార్టులో సునీల్ పాత్ర కీలకంగా సాగనుందని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఎఫ్ 3లో రవితేజ కీలక పాత్రలో కనిపిస్తారంటూ ఇప్పటికే వార్తలు రాగా..ఈ చిత్రంలో వెంకీ, వరుణ్ తప్ప మరో హీరో ఉండరని అనిల్‌రావిపూడి ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. మరి ఈ సారి సాయిధరమ్ తేజ్ పేరు తెరపైకి రావడంతో.. ఇందులో ఎంతవరకు వాస్తవముందనే దానిపై క్లారిటీ రావాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి..
శృతిహాసన్, అమలాపాల్..బోల్డ్‌గా 'పిట్టకథలు' టీజర్
కిస్ ఇవ్వలేదని.. ఆమె నన్ను వదిలేసి వెళ్లింది
రాశీఖన్నాకు నో చెప్పిన గోపీచంద్..!
ఫన్ షురూ..ఎఫ్3 సెట్ లో వెంకీ అండ్ టీం
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.