పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నదే వాళ్లను కొట్టడానికంట..!

పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ మొదట్లో చాలా సినిమాల్లో తన టాలెంట్ కూడా చూపించాడు పవన్. అంతేకాదు.. తన మార్షల్ ఆర్ట్స్ కారణంతోనే సినిమాలో ఫైట్స్ కూడా అదిరిపోయేలా కంపోజ్ చేసేవాడు. కొన్ని సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫర్ గా కూడా వర్క్ చేసాడు పవన్. డాడీ సినిమాలో చిరుతో పవన్ కంపోజ్ చేసిన ఫైట్ ఇప్పటికీ అదుర్స్ అంతే. మార్షల్ ఆర్ట్స్ అంటే తెలుగులో ఒకప్పుడు సుమన్, భానుచందర్ లాంటి హీరోలు గుర్తొచ్చే వాళ్లు.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నాడు.
ఈయన ఎందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడనే ప్రశ్నకు సమాధానం చాలా మందికి సరిగ్గా తెలియదు.. క్లారిటీ కూడా లేదు. అప్పట్లో పవన్ కు చదువు పెద్దగా ఎక్కలేదు. కానీ లోకజ్ఞానం మాత్రం బోలెడు ఉంది. కేవలం చదువుతో వచ్చిన జ్ఞానం కాదు అది.. ఎన్నో వందల వేల పుస్తకాలు చదివాడు. తనకు అచ్చిరాని చదువును కొంతవరకు మాత్రమే పట్టించుకున్నాడు పవన్ కళ్యాణ్. దాంతో వచ్చిన వరకు చదువుకున్నానని చెప్తుంటాడు కూడా.
తనకు ఎందుకో చదువు ఎక్కలేదని.. ఆ తర్వాత చదువు రాలేదు కాబట్టి సినిమాల కోసమే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడేమో అని చాలా మంది పవన్ గురించి అనుకుంటారు. కానీ అసలు కారణం మాత్రం అది కాదని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. పవన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోడానికి కారణం చిరంజీవి. అవును.. అప్పట్లో తన పెద్ద తమ్ముడు నాగబాబుకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని చిరంజీవి చాలా కోరుకున్నాడు కానీ ఆయన లాయర్ అవుతానంటూ అటు వైపు వెళ్లిపోయాడు. అలా తన కోరిక పవన్ వైపు మళ్లించాడు. పవన్ కూడా ముందు నుంచి మార్షల్ ఆర్ట్స్‌పై అస్సలు ఆసక్తి చూపించలేదు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన చెంతకు వచ్చింది అది. నేర్చుకోవాల్సిన అవసరం కల్పించింది కూడా చిరంజీవే.
చెన్నైలో పవన్ చదువుకుంటున్న సమయంలో కొందరు చిరంజీవి సినిమాలు చూసి అతన్ని ఊరికే తిట్టేవాళ్లు.. కాలేజీలో కొందరు పవన్ ముందే తన అన్నయ్య నటనతోపాటు లుక్‌పై కూడా కొన్ని విమర్శలు చేసేవాళ్లు.. అలాంటివి చూసినపుడు విన్నపుడు రక్తం మరిచిపోయేదని.. కానీ సన్నగా రివటలా ఉన్న పవన్ వాళ్లను ఎదిరించలేకపోయాడని చెప్తుంటారు. వాళ్లను కొట్టాలంటే ఇలా ఉంటే సరిపోదు.. కచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి.. అప్పుడే ఈ ఆలోచన పవన్ బుర్రలోకి వచ్చింది.
తన అన్నయ్యను కామెంట్ చేస్తున్న వాళ్ల తుక్కు రేగ్గొట్టాలంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఆయన శిక్షణ తీసుకున్నట్లు పవన్ సన్నిహితులే చెప్తుంటారు. అందులో ఆ తర్వాత ఆయన బ్లాక్ బెల్ట్ కూడా అందుకున్నాడు. ఆ తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, బద్రి, ఖుషీ, జల్సా లాంటి సినిమాల్లో చూపించాడు. 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా పవన్‌లో అదే ఎనర్జీ కనిపిస్తుంది. మొన్న విడుదలైన వకీల్ సాబ్ టీజర్ లోనూ పవన్ అదే ఎనర్జీతో ఫైట్స్ చేసాడు.
ఇవి కూడా చదవండి..
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ ఇతడే..!
చిరంజీవి నన్ను చాలా మెచ్చుకున్నారు..
బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న కేథరిన్
గోవాలో సన్నీలియోన్ హాట్ ఫొటోషూట్
అటు కేరళ అందాలు..ఇటు సోనాక్షి వయ్యారాలు
ఫొటోగ్రాఫర్ గా మారిన మీరా రాజ్‌పుత్..స్టిల్స్ వైరల్
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- సీఎం అల్లుడు, మరో ఇద్దరికి జ్యుడీషియల్ కస్టడీ
- భారీ ఆఫర్‌కు నో చెప్పిన వరంగల్ హీరోయిన్..!
- బెంగాల్ పోరు : కాషాయ పార్టీలోకి దాదా ఎంట్రీపై దిలీప్ ఘోష్ క్లారిటీ!
- పట్టభద్రులూ ఆలోచించి ఓటు వేయండి : మంత్రి నిరంజన్‌రెడ్డి
- బెంగాల్ పోరు : తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి
- 13 అడుగుల భారీ కొండచిలువ..!
- ఇక 24 గంటలూ కరోనా వ్యాక్సినేషన్
- నాగ్ అశ్విన్ కాలేజ్ ఈవెంట్ లో నన్ను చూశాడు: ఫరియా
- ఈఎస్ఐలో 6552 యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టులు
- ఎంజీఆర్ రూట్లో కమల్ హాసన్.. ఆ స్థానం నుంచే పోటీ !