బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 22:04:03

అభిమానుల‌కు ద‌గ్గ‌ర కావ‌డానికి ఇదే స‌రైన మార్గం : నిధి అగ‌ర్వాల్‌

అభిమానుల‌కు ద‌గ్గ‌ర కావ‌డానికి ఇదే స‌రైన మార్గం : నిధి అగ‌ర్వాల్‌

ముంబై : నటి నిధి అగర్వాల్ ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ అభిమానుల‌ను చేరుకోవ‌డానికి ఇదే స‌రైన మార్గ‌మ‌ని తెలిపారు. “నేను ఈ కొత్త వెంచర్ గురించి నిజంగా సంతోషిస్తున్నా. నా అభిమానులు నన్ను చాలా కాలంగా యూట్యూబ్ ఛానెల్‌లో రమ్మని అభ్యర్థిస్తున్నారు. నా ప్రయాణాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఆనందంగా ఉంది. వారిని చేరుకోవడానికి ఇదే మంచి మార్గం అని నా అభిప్రాయం. అభిమానులు నా వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితానికి ఇప్పుడు దగ్గరగా ఉంటారు. నా అభిమానులతో సంబంధం మరింత పెరుగుతుందని నేను అనుకుంటున్నా.” అని నిధి అన్నారు.

ఛానెల్ ప్రారంభించిన త‌రువాత మొద‌ట‌గా ఆమె పర్యావరణ అనుకూలమైన గణేశ్ విగ్ర‌హాల‌కు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. “నేను గ‌ణేశ్ విగ్ర‌హాల త‌యారీ వీడియోను పెట్టిన త‌రువాత చాలా వ్యూస్ వ‌చ్చాయి. వీడియోతో నిజంగా మంచి స్పందన, చాలా ప్రేమను అందుకున్నాను.” అన్నారు. చివ‌ర‌గా ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాలో న‌టించిన నిధి.. ప్ర‌స్తుతం భూమి అనే చిత్రంలో న‌టిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo