శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 22, 2021 , 15:41:02

'నార‌ప్ప' డైరెక్ట‌ర్ కొత్త సినిమా ఇదే..!

'నార‌ప్ప' డైరెక్ట‌ర్ కొత్త సినిమా ఇదే..!

టాలీవుడ్ డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల ప్ర‌స్తుతం వెంకటేశ్ తో నార‌ప్ప సినిమా చేస్తున్నాడు. రూర‌ల్ యాక్ష‌న్ డ్రామాగా వ‌స్తోన్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి ఫీమేల్ లీడ్ పోషిస్తోంది. స‌మ్మ‌ర్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. ఇదిలా ఉంటే డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా ఫిక్స‌యింది. ప్ర‌ముఖ నిర్మాత‌, ఆర్ట్ డైరెక్టర్ చంటి అడ్డాల కుమారుడిని హీరోగా ప‌రిచ‌యం చేయ‌నున్నాడు. ఈ చిత్రానికి కూచిపూడి వారి వీధిలో..అనే టైటిల్ ను ఖ‌రారు చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. గీతాఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పై బ‌న్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

గోదావ‌రి ప్రాంతం నేప‌థ్యంలో  సాగే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నాడు శ్రీకాంత్ అడ్డాల‌. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. త‌మిళంలో ధ‌నుష్ హీరోగా వ‌చ్చిన అసుర‌న్ ను తెలుగులో నార‌ప్ప టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల‌. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఇవి కూడా చ‌ద‌వండి..

సూర్య‌-బోయ‌పాటి కాంబోలో సినిమా..!

ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లు లేవు..కార‌ణ‌మేంటో ?

మ‌హేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

చిరంజీవి ఆ రీమేక్ ను ప‌క్క‌న పెట్టాడా..?

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుల క‌హానీ ఏంటి?

రజినీకాంత్ అనూహ్య నిర్ణయం..ఆందోళనలో ఫ్యాన్స్..!


సూర్య సినిమాకు అవమానం జ‌రిగిందా..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo