మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Aug 02, 2020 , 16:10:54

‘అధీరా’ ముఖంపై టాటూ..అర్థ‌మిదేన‌ట‌..!

‘అధీరా’ ముఖంపై టాటూ..అర్థ‌మిదేన‌ట‌..!

ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాఫ్ట‌ర్-2. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ మూవీలో అధీరా పాత్ర‌లో నటిస్తున్నాడు. అధీరాకు హాలీవుడ్ స్టైల్ లో హెయిర్ క‌ట్ ఉండ‌గా..నుదుటిపై నుంచి కింద వ‌ర‌కు సంస్కృత భాష‌లో టాటూ వేయ‌బ‌డి ఉంది. అస‌లు ఆ టాటూ వెనుకున్న అర్థ‌మేమై ఉంటుంద‌ని ఇపుడు నెటిజ‌న్లు ఆలోచలో ప‌డ్డారు. సంస్కృత భాష‌లో ఈ టాటూ ఉన్న‌ట్టు భావిస్తుండ‌గా.. ‘నా నుండి జాలి, ద‌య ఆశించొద్దు. నేను మృత్యువుకు జ‌న్మ‌స్థ‌లాన్ని. ఈ ప్ర‌పంచానికి యుద్ధం ఒక‌టే శ‌ర‌ణ్యం’ అనేది దాని అర్థ‌మ‌ని చెబుతున్నారు కొంద‌రు నెటిజ‌న్లు.

ఏది ఏమైనా అధీరా పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుంద‌న‌డ‌టంలో ఎలాంటి సందేహం లేదు. పాన్ ఇండియా సినిమాగా య‌శ్ హీరోగా కేజీఎఫ్ కు సీక్వెల్ గా వ‌స్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo